Sunday, April 28, 2024

నేడు మానుకోటకు మంత్రి కేటీఆర్

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : గురువారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అందుకోసం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కేంద్రంలో మంత్రి కెటిఆర్ పర్యటన ఏర్పాట్లను భుజాన వేసుకుని అంతా తానై తగిన ఏర్పాట్లను ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్మైన్ అంగోతు బిందు, కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఇతర శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నేతలతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఆవిష్కరించనున్న స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు రూ. 50 కోట్ల ఎస్. డి. ఎఫ్ నిధులతో మానుకోట పట్టణంలో చేపట్టే పలు అభివృద్ధి ్ద పనుల ఫైలాన్‌ను, పట్టణ నడిబోడ్డున రూ. 6. 05 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన వెజ్, నాన్ వెజ్ మోడల్ మార్కెట్‌ను, రామచంద్రాపురంలో నిర్మించిన 200 డబుల్ బెడ్ రూం ఇండ్లను, సభ జరిగే ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను మంత్రితో పాటు వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలను ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సత్యవతి వెల్లడించారు.

గురువారం మంత్రి కేటీఆర్ ఉదయం 10.30 గంటలకు మానుకోట జిల్లా కేంద్రానికి చేరుకుంటారని వివరించారు. తొలుత స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన అభివృద్ధ్ది పనుల పైలాన్‌ను ఆవిష్కస్తారని చెప్పారు. అనంతరం మోడల్ మార్కెట్‌ను ప్రారంభించనున్నారన్నారు. అక్కడి నుంచి రామచంద్రాపురం కాలనీలో నిర్మించిన రెండు వందల డబుల్ రూం ఇళ్లను ప్రారంభిస్తారని పేర్కోన్నారు. అక్కడి నుంచి మానుకోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఈదులపూసపల్లి వరకు రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మించే రోడ్డు విస్తరణ, రోడ్డు డివైడర్, సెంట్రట్ లైటింగ్ నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేపట్టనున్నారని వెల్లడించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభ వేదిక మీదుగా జిల్లాలోని పోడు భూముల పట్టాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీకి శ్రీకారం చుడతారని మంత్రి సత్యవతి పేర్కోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News