Wednesday, April 17, 2024

ఆదివాసీ గెరిల్లా యోధుడు

- Advertisement -
- Advertisement -

జాతి మనుగడ, అస్తిత్వ పరిరక్షణకై ఆదివాసీ ప్రజా ఉద్యమాలే కాకుండా సాయుధ గెరిల్లా తరహా పోరాటమే శరణ్యమని భావించిన రాము స్వతంత్రంగా 2004, సెప్టెంబర్ 30న ‘ఆదివాసీ లిబరేషన్ టైగర్స్’ (ఎఎల్టీ) విప్లవ సంస్థని స్థాపించాడు. సామాజిక అసమానతలపై పోరా డుతున్న కామ్రేడ్ మారోజు వీరన్న (సిపియుఎస్‌ఐ)తో సమకాలికంగా రాము పని చేశారు. ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు గల షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలను ఐక్యం చేస్తూ ప్రత్యేక పరిపాలన విధానాన్ని, స్వయం పాలనను ఆదివాసీలకే అందించాలని తద్వారా ఆదివాసీ సమాజం విద్య, ఉద్యోగ, రాజీకయ, ఆర్థిక రంగాలలో పురోగతి సాధించగలదని అందుకు ఆదివాసీ యువత నిర్విరామంగా పోరాటం చేయడం కోసమే ఆదివాసీ లిబరేషన్ టైగర్ ఆవిర్భవించిందని ప్రకటించాడు.

ఆదివాసీ సమాజం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడానికి పాలకులు, ప్రభుత్వ విధానాలే కారణమని షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా తమను తామే పరిపాలించుకోవడానికి, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లభించాలంటే ప్రజా ఉద్యమాలు పరిష్కారం చూపవని, స్వయం పాలన ఉద్యమాలను నమ్మిన విప్లవోద్యమ వీరుడు కుంజ రాము. ప్రత్యామ్నాయంగా ఆదివాసీ గెరిల్లా పోరాటాలు తక్షణావసరమని ఎలుగెత్తి చాటిన ఏకైక ఆదివాసీ విప్లవోద్యమ నాయకుడు కుంజ రాము. అవిభక్త వరంగల్ జిల్లా పాఖాల కొత్తగూడెం మండలంలోని మోకాళ్లపల్లి అనే గిరిజన గూడెంలో కోయతెగ నిరుపేద కుటుంబంలో కన్నయ్య, లచ్చమ్మ దంపతులకు కుంజ రాము జన్మించాడు.

ఉమ్మడి విప్లవ పార్టీలో మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనలను ఆకళింపు చెసుకొని జనశక్తి పార్టీలో తిరుగులేని విప్లవ నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో విప్లవోద్యమంలో ఏర్పడ్డ చీలికల్లో భాగంగా సిపిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతుండగా అరెస్టు కాబడి జైలుజీవితం గడిపిన సమరశీలి. శ్రామికుల, రైతుకూలీల న్యాయ పోరాటాన్ని నడిపించి, నవసమాజ స్థాపన కోసం భావసారూప్యత గల ఉద్యమ శక్తులను సమీకరించి, రాజ్యాధికారం సాధించాలంటే అణగారిన వర్గాల పోరాటాలు ప్రధాన భూమిక పోషించాలని భావించి, వివిధ కుల సంఘాలైన తుడుం దెబ్బ, మాదిగ దండోరా, డోలి దెబ్బ, మోకు దెబ్బ, పూసలకేక లాంటి అనేక కుల సంఘాలను సంఘటిత పర్చిన ఆదివాసీ యోధుడు. తన 35 ఏళ్ల అజ్ఞాత జీవితంలో కామ్రేడ్ రాము ఆదివాసీ సమాజానికి స్వయంపాలన రావడం అసాధ్యమని ఆదివాసీ ఉద్యమ కెరటాలైన రాంజీ గోండు, కుమ్రంభీం, సోయం గంగులు లాంటి వీరయోధుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆదివాసీల జీవన నినాదమైన ‘జల్ -జంగల్ జమీన్’ కోసం ‘మా ఊళ్లో మా రాజ్యం’ అనే స్వయం పాలన కాంక్షతో పోరాడారు.

భారత రాజ్యాంగం కల్పించిన ఐదవ షెడ్యూల్ భూభాగమంతా స్వయం పాలన కింద ఉండాల్సింది. జాతి మనుగడ, అస్తిత్వ పరిరక్షణకై ఆదివాసీ ప్రజా ఉద్యమాలే కాకుండా సాయుధ గెరిల్లా తరహా పోరాటమే శరణ్యమని భావించిన రాము స్వతంత్రంగా 2004, సెప్టెంబర్ 30న ‘ఆదివాసీ లిబరేషన్ టైగర్స్’ (ఎఎల్టీ) విప్లవ సంస్థని స్థాపించాడు. సామాజిక అసమానతలపై పోరాడుతున్న కామ్రేడ్ మారోజు వీరన్న (సిపియుఎస్‌ఐ)తో సమకాలికంగా రాము పని చేశారు. ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు గల షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాలను ఐక్యం చేస్తూ ప్రత్యేక పరిపాలన విధానాన్ని, స్వయం పాలనను ఆదివాసీలకే అందించాలని తద్వారా ఆదివాసీ సమాజం విద్య, ఉద్యోగ, రాజీకయ, ఆర్థిక రంగాలలో పురోగతి సాధించగలదని అందుకు ఆదివాసీ యువత నిర్విరామంగా పోరాటం చేయడం కోసమే ఆదివాసీ లిబరేషన్ టైగర్ ఆవిర్భవించిందని ప్రకటించాడు.

యువతను సమీకరించి ఉద్యమిస్తున్న తరుణంలో ఏఎల్టీ బలపడితే షెడ్యూల్డ్ ప్రాంతాలపై తమ ఆధిపత్యం చెల్లదని అప్పటి రాజ్యం రాముపై నిఘా పెంచింది. ఏజెన్సీ ప్రాంతాలలో గల వనరులు – కొండ చీపుర్లు, తవిసి బంక, చిల్లగింజలు మొదలుకొని ఇసుక వరకు బాక్సెట్, మాంగనీను, ఇనుప ఖనిజాల సంపదను కొల్లగొట్టడం వీలుపడదని గ్రహించిన ప్రభుత్వం ఆదివాసీ లిబరేషన్ టైగర్ దళాన్ని మట్టుబెట్టాలని తలచింది. 2005 మార్చి 27న వరంగల్, ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎర్రమ్మ గుట్టలపై (కంబాలపల్లి ప్రాంతం)సమావేశమై ఉన్న సమయంలో పోలీసులు ఏకపక్షంగా జరిపిన కాల్పుల్లో రాము అసువులు బాసాడు. కామ్రేడ్ రాము స్ఫూర్తి, స్వయం పాలన నినాదం అనేక ఏజెన్సీ గ్రామాల్లో సజీవంగానే ఉంది.

గుమ్మడి లక్ష్మీనారాయణ
9491318409

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News