Thursday, April 18, 2024

మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులదే విజయం

- Advertisement -
- Advertisement -

TRS candidates

 

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండమైన విజయం సాధిస్తారని టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల పేర్కొన్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ఎన్‌ఆర్‌ఐలు తమవంతు కృషి చేస్తారని ఆమె తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల గెలుపు కోసం క్యాంపెయిన్‌తో పాటు సోషల్‌మీడియా ప్రచారం ఎలా నిర్వహించాలన్న దానిపై కువైట్‌లో ఆదివారం రాత్రి పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిలాష మాట్లాడుతూ అభ్యర్థుల గెలుపు కోసం కువైట్ టిఆర్‌ఎస్ సభ్యులు తమ వంతు కృషి చేస్తారని ఆమె పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల సూచనల మేరకు గత ఎన్నికల్లో చేసిన కాల్ క్యాంపెయిన్‌తో పాటు సోషల్ మీడియాను ఈసారి కూడా విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు ఆమె తెలిపారు.

కెసిఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు రాబోయే పురపాలక ఎన్నికల్లో గెలుపు జెండా ఎగురవేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క తెలంగాణలోనే దాదాపు 40 లక్షల మందికి ఆసరా పింఛన్లు పెంచారని, 24 గంటల కరెంట్ సరఫరా, రైతు బంధు, రైతు భీమా లాంటి మరెన్నో అద్భుతమైన పథకాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇవన్నీ అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయని ఆమె తెలిపారు. గత ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కువైట్ శాఖ ఆధ్వర్యంలో అభ్యర్థుల విజయం కోసం తమవంతు పాత్ర పోషించామని, ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఎన్‌ఆర్‌ఐల సంపూర్ణ మద్ధతు ఉంటుందని అభిలాష తెలిపారు.

TRS candidates win in Municipal Elections
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News