Friday, March 29, 2024

చైర్మన్ల ఎంపికపై టిఆర్‌ఎస్ దృష్టి

- Advertisement -
- Advertisement -

TRS

 

ఇన్‌ఛార్జీలకు, ఎంఎల్‌ఏలకు విప్ జారీచేసే అధికారాలు
ప్రజాప్రతినిధులు కోరుకున్న మున్సిపాలిటీలో ఓటు హక్కు

హైదరాబాద్: నేడు మున్సిపాలిటీ, కార్పోరేషన్ల ఫలితాలు వెలుబడ నున్న నేపథ్యంలో ఛైర్మన్ల ఎంపికపై టిఆర్‌ఎస్ అధిష్ఠానం దృష్టి సారించింది. గెలిచిన వార్డు సభ్యుల నుంచి ఛైర్మన్‌లను ఎంపిక చేయాల్సి ఉండగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా గెలిచే అవకాశాలున్న అభ్యర్థులను అధిష్టానం పరిశీలిస్తోంది. ఇప్పటికే పార్టీ అధినేత, సిఎం కె.చంద్రశేఖర్ రావు నుంచి ఎ ఫారాల ద్వారా బిఫారాలు ఇచ్చే అధికారం పొందిన నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, స్థానిక శాసనసభ్యులు ఛైర్మన్ల ఎంపికలో కీలకంగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని ఆధిష్టానం ఆదేశించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారిగా ఎన్నికైన అభ్యర్థుల నుంచి ఎవరిని ఛైర్మన్‌గా ఎంపిక చేయాలనే నిర్ణయం అధిష్టానం నుంచి నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకు వెలువడనుంది.

అయితే ఇప్పటికే ఎ ఫారాలు పొందిన నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, స్థానిక శాసన సభ్యులులకు ఎటూ ఫారాలు ఇచ్చే అధికారాలు సంక్రమించాయి. ఈ అధికారాలతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికైన టిఆర్‌ఎస్ అభ్యర్థులను విప్‌లుగా నియమిస్తూ ఎటూ ఫారాలను ఇస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలో విప్‌గా ఎంపికైనవారు అధిష్టానం ఆదేశాల మేరకు టిఆర్‌ఎస్ సభ్యులు ఎవరిని ఛైర్మన్ పదవికి బలపర్చాలో విప్ జారీ చేస్తారు. విప్ మేరకు టిఆర్‌ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో ఒకరిని ఛైర్మన్‌గా బలపరుస్తారు.

ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు
తాము నమోదు చేసుకున్న మున్సిపాలిటీ నుంచి ప్రజాప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొంటారు. ఎక్కడైన మెజారిటీ తక్కువగా ఉంటే టిఆర్‌ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అక్కడ పేరు నమోదు చేసుకుని ఓటు వేసే అధికారాలున్నాయి. ఈ మేరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, విఫ్ తదితర సభ్యుల ఎంపికకు ఆదేశాలు జారీ చేయనున్నారు.

టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అధ్యక్షతన టిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఎన్నికల సమన్వయ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. పార్టీల బలబలాలను అంచనావేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ నియోజక వర్గాల ఇన్‌ఛార్జీలకు కెటిఆర్ ఆదేశాలు జారీ చేయనున్నారు. టిఆర్‌ఎస్ అధిష్ఠానం ఆదేశాలమేరకు మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్న ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆతర్వాత ఆదివారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహింటనున్నట్లు సమాచారం.

సిద్ధమవుతున్న జాబితా
విజయం సాధించనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియపై టిఆర్‌ఎస్ ఇప్పటికే జాబితాను సిద్ధం చేసింది. ఎన్నికల ఫలితాలు వెలుబడిన అనంతరం అధిష్ఠానం దగ్గర ఉన్న జాబితాను, గెలిచిన అభ్యర్థులను పరిశీలించి అప్పటికప్పుడే అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటివరకు టిఆర్‌ఎస్ అధిష్టానం దగ్గర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారిగా జాబితాలు సిద్ధంగా ఉన్నాయి.

TRS focus on selection of chairmans
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News