Saturday, September 30, 2023

ప్రధాని మోడీపై టిఆర్ఎస్ ఎంపిలు ప్రివిలేజ్ మోషన్..

- Advertisement -
- Advertisement -

TRS MPs moves Privilege Motion against PM Modi

న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ ఎంపిలు రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం టిఆర్ఎస్ ఎంపిలు కే కేశవరావు, సంతోష్‌, లింగయ్య యాదవ్‌, సురేశ్‌ రెడ్డిలు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు ప్రివిలేజ్ నోటీసు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలను అవమానించారని పేర్కొన్నారు. తలుపులు మూసేసి తెలంగాణ బిల్లు పాస్ చేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. పార్లమెంట్ లో పాస్ అయిన బిల్లును అవహేళన చేయడం సరికాదని.. ఇది సభా హక్కులను ఉల్లంఘించడమేనని టిఆర్ఎస్ ఎంపిలు పేర్కొన్నారు.

TRS MPs moves Privilege Motion against PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News