Sunday, April 28, 2024

7094 స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

7094 స్టాఫ్ నర్సులకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సుల ప్రాముఖ్యత గుర్తించిన ప్రభుత్వం మొత్తం 7094 పోస్టులను భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించి స్టాఫ్ నర్సులను ఎంపిక చేసింది.ఈ క్రమంలో బుధవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను అందజేశారు.

కొత్తగా నియమితులైన స్టాఫ్ నర్సుల జీతాల కోసం నెలకు దాదాపు రూ.35 కోట్లు ఆర్థిక వ్యయం అవుతుంది. రోగుల సంరక్షణ సేవలను అందించడంలో స్టాప్ నర్సులు కీలక పాత్ర వహిస్తారు.  కాగా, ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ కేటగిరీలో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 138 పోస్టులను భర్తీ చేయడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News