Thursday, May 2, 2024

కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదివారం చివరిరోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్ పై కాగ్ నివేదికలు ఇచ్చింది. 11 గ్రాంట్లకు రూ.75 వేల కోట్లు అధికంగా వ్యయం చేసిందని కాగ్ నివేదిక పేర్కొంది. నీటిపారుదల, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్ శాఖలకు 34 శాతం అధికంగా ఖర్చు చేసినట్లు తెలిపింది. గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే తక్కువగా ఖర్చు చేసిందని చెప్పింది. 289 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీని, 259 రోజులపాటు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సౌకర్యం వినియోగించినట్లు పేర్కొంది.

100 రోజులపాటు రూ.22,669కోట్ల ఓవర్ డ్రాప్ట్ కు వెళ్లిన ప్రభుత్వం..2020-21లో రూ.9,335కోట్ల రెవెన్యూ లోటుకు వెళ్లిందని తెలిపింది. రెవెన్యూ రాబడుల్లో ప్రభుత్వం 50 శాతం.. వేతనాలు, వడ్డీ చెల్లింపులకే ఉపయోగించినట్లు చెప్పింది.2021-22 వరకు రాష్ట్ర రుణాలు రూ.3,14,662కోట్లకు చేరుకుందని, తెలంగాణ రాష్ట్ర అప్పు జిఎస్డిపిలో 27.40 శాతమని తెలిపింది. 2021-22లో రాష్ట్రంలో పన్ను ఆదాయం 37 శాతమని, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 44 శాతం తగ్గాయని కాగ్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News