Thursday, May 2, 2024

గణేష్ నిమజ్జనం కోసం ఆర్టిసీ ప్రత్యేక ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

TSRTC special arrangements for Ganesh immersion

29 డిపోల నుంచి 565 ప్రత్యేక బస్సులు
బ్రేక్ డౌన్ల నివారణకు 3 ప్రత్యేక రిలీఫ్ వ్యాన్లు

హైదరాబాద్: గణేష్ నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టిసి మంగళవారం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యం కోసం 565 ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడకు డిపో నుంచి 20 బస్సులు బషీర్‌బాగ్- కాచిగూడ, ముషీరాబాద్ డిపో-1కు చెందిన 20 బస్సులు బషీర్‌బాగ్-రామ్‌నగర్, దిల్‌షుక్‌నగర్ డిపోకు చెందిన 15 స్సులు ఓల్డ్‌ఎమ్మెల్యేక్వార్టర్స్- కొత్తపేట,హయత్‌నగర్ డిపో-1కు చెందిన 20 బస్సులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్- ఎల్‌బినగర్, హయత్‌నగర్ -2 డిపోకు చెందిన 15 బస్సులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్- వనస్థలిపురం, మిధాని డిపోకు చెందిన 15బస్సులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్- మిధాని,ఉప్పల్ డిపోకు చెందిన 35 బస్సులు టిటిడి కళ్యాణమండపం- ఉప్పల్, ఇందిరాపార్క్- ఉప్పల్, కంటోన్మెంట్ డిపోకు చెందిన 20 బస్సులు ఇందిరాపార్క్- సికింద్రాబాద్, హకీంపేట డిపోకు చెందిన 20 బస్సులుఇందిరాపార్క్- రీసాలాబజార్,కుషాయిగూడ డిపోకు చెందిన 20 బస్సులు ఇందిరాపార్క్,మల్కాజిగిరి-ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్స్, చెంగిచర్ల డిపోకు చెందిన 20 బస్సులు ఇందిరాపార్క్-ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్స్,

రాణిగంజ్-1,2 డిపోలకు చెందిన 35 బస్సులు ఇందిరాపార్క్- సికింద్రాబాద్, ఇందిరాపార్క్- మల్కాజిగిరి, ముషీరాబాద్ డిపో-2కు చెందిన 20బస్సులు ఇందిరాపార్క్- జామైఉస్మానియా, మెహదీపట్నం డిపోకు చెందిన 15 బస్సులు లక్డికాపూల్- టోలీచౌకీ, బర్కత్‌పురా డిపోకు చెందిన 15 బస్సులు లక్డికాపూల్- ఖైరతాబాద్,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి డిపోకు చెందిన 15లక్డికాపూల్-ఖైరతాబాద్, రాజేంద్రనగర్ డిపోకు చెందిన 15 బస్సులు లక్డికాపూల్- రాజేంద్రనగర్ (రూట్ నెం 92),పలక్‌నుమా డిపోకు చెందిన 15 బస్సులు ఆల్ ఇండియా రేడియో- కోటీ, జీడిమెట్లకు డిపోకు చెందిన 45 బస్సులు ఖైరతాబాద్- జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, గాజులరామారం, కూకట్‌పల్లి డిపోకు చెందిన 45బస్సులు ఖైరతాబాద్-బోరబండ,బాచుపల్లి, మియాపూర్ 1, 2 డిపోలకు చెందిన 45బస్సులు ఖైరతాబాద్- బాచుపల్లి, లింగంపల్లి,కూకట్‌పల్లి, బిహెచ్‌ఈఎల్‌కు డిపోకు చెందిన 15 బస్సులు ఖైరతాబాద్- పటాన్‌చెరు, రాణిగంజ్ డిపో-1కు చెందిన 15 బస్సులు ఖైరతాబాద్-సికింద్రాబాద్(రూట్ నెం 49) 29డిపోలకు చెందిన మొత్తం 565 బస్సులు ఆయా ప్రాంతాల మధ్య తిరుగుతాయన్నారు. వీటి నిర్వాహణను ఆయా డిపోల డీఎం, డీవీఎంలు పర్యవేక్షిస్తారన్నారు. ఇతర వివరాల కోసం ప్రత్యేకంగా రెండు స్టేషన్లు రతిఫైల్ బస్‌స్టేషన్ (9959226454), కోటీ బస్టేషన్ (9959226160)లను సంప్రదించాలన్నారు.

బ్రేక్‌డౌన్ రీలీఫ్ కోసం 3 ప్రాంతాల్లో ప్రత్యేక బస్సులు

ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు మధ్యలో ఆగిపోతే వెంటనే (బ్రేక్ డౌన్)మరమ్మత్తులు నిర్వహించేందుకు మెహదీపట్నం డిపో(8333904538) కు చెందిన బస్సులన ఓల్డ్ ఎమ్మెల్యే కార్వర్టర్ వద్ద ,అదే విధంగా ముషీరాబాద్ 1డిపోకు (8333904537) చెందినబస్సులను ఇందిరాపార్క్‌వద్ద, రాణిగంజ్ డిపోకు ( 8333904541) బస్సను ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News