Thursday, May 2, 2024

వినాయక చవితి కానుకగా…

- Advertisement -
- Advertisement -

Tuck Jagadish release on September 10

 

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టక్ జగదీష్’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారనే విషయం మీద ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నిర్మాతల శ్రేయస్సు కోరి సినిమా రిలీజ్ నిర్ణయం వాళ్ళకే వదిలేశానని నాని ప్రకటిస్తే.. పరిస్థితులు బాగాలేకపోవడంతో డిజిటల్ రిలీజ్ కోసం నానిని ఒప్పించామని మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో ‘టక్ జగదీష్’ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా వచ్చే నెల 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నాని ప్రకటించారు. పండక్కి ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడమని ట్వీట్ చేశారు. కాగా ‘టక్ జగదీష్’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, – హరీష్ పెద్ది నిర్మించారు. ఇందులో రీతూవర్మ, – ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు, – నాజర్, – డేనియల్ బాలాజీ, – ప్రియదర్శి, – తిరువీర్, – రోహిణి, – ప్రవీణ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News