Friday, May 3, 2024

చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను చార్మినార్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 50 కార్టన్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.15లక్షలు ఉంటుంది. పోలీసుల కథనం ప్రకారం…భగవాన్‌దాస్ బజాజ్, వేణుగోపాల్ బజాజ్ ఇద్దరు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు. బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి నగరంలోని పతంగ్ మహల్, కాళీ కమాన్, గుల్జార్ హౌస్‌లో షాపులు ఏర్పాటు చేసి పతంగులు, దారాలను విక్రయిస్తున్నారు. సంక్రాంతికి చాలామంది పతంగులను ఎగురవేయనున్నారు.

దీనికి క్యాష్ చేసుకునేందుకు ఇద్దరు నిందితులు ప్లాన్ వేశారు. దీని కోసం చైనా మాంజాను విక్రయించి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. నైలాన్ మాంజాకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో దానిని అక్రమంగా కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. చైనా మాంజా పక్షలకు ప్రమాదం కావడంతో దీనిని ప్రభుత్వం నిషేధించింది. దీనిని తీసుకుని వచ్చి పలువురికి విక్రయిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్, ఎస్సై నవీన్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News