Friday, May 3, 2024

ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోని బంగారు చైన్లను చోరీ చేస్తున్న ఇద్దరు స్నాచర్లను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 29.7 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….సిద్దిపేటకు చెందిన కూరాకుల రోహిత్, గొలుసుల అఖిలేష్ కలిసి చైన్‌స్నాచింగ్‌లు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు కలిసి గంజాయి విక్రయిస్తుండగా సిద్దిపేట పోలీసులు గతంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రోహిత్ తొమ్మిదవ తరగతి వరకు చదువుకుని ఆపివేశాడు. చిన్నప్పటి నుంచి కూలీగా పనిచేశాడు. ఈ క్రమంలోనే రీల్స్ చేస్తుండగా ఇన్‌స్టాలో వైజాగ్‌కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులు స్నేహం చేసిన ఇద్దరు తర్వాత వివాహం చేసుకున్నారు.

తర్వాత రోహిత్ కాపురం సిద్దిపేటో పెట్టాడు. కానీ వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోవడంలేదు. దీంతో భార్య బంగారు ఆభరణాలను కుదువపెట్టి డబ్బులు తీసుకుని వచ్చి కుటుంబ అవసరాలు తీర్చాడు. తర్వాత డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డాడు.ఈ క్రమంతోనే తన స్నేహితుడు గొలుసుల అఖిలేష్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అఖిలేష్ గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిద్దామని రోహిత్‌కు చెప్పాడు. దీనికి అంగీకరించిన రోహిత్ ఇద్దరు కలిసి గంజాయి కొనుగోలు చేసి సిద్దిపేటలో విక్రయిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఇద్దరు కొద్ది రోజులు విడిగా ఉన్నారు. రోహిత్ భార్య కుటుంబాన్ని హైదరాబాద్‌కు షిఫ్ట్ చేసింది. జల్‌పల్లిలోని తన బంధువుల ఇంటి సమీపంలో ఉన్నారు. వినాయక చవితి కావడంతో ట్రాలీ ఆటోనడుపుతున్న రోహిత్‌ను బ్యాంక్ కంపెనీ వారు సంప్రదించారు. గణేష్ నిమజ్జనం కోసం ఆటో పెట్టాలని చెప్పారు.

దీంతో తన స్నేహితుడు అఖిలేష్‌ను పిలిపించాడు రోహిత్ ఇద్దరు కలిసి వారంలో రూ.20,000 సంపాదించాడు. వచ్చే డబ్బులు కుటుంబ అవసరాలు తీరడంలేదని ఇద్దరు కలిసి చైన్‌స్నాచింగ్ చేయాలని ప్లాన్ వేశారు. కూకట్‌పల్లిలో చైన్‌స్నాచింగ్‌కు యత్నించగా కుదరలేదు. తర్వాత రాజేంద్రనగర్, అంబర్‌పేటలో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలోని బంగారు చైన్‌లను స్నాచింగ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సైలు వెంకటేష్, అరవింద్ గౌడ్, నాగరాజు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News