- Advertisement -
రాంఛీ: రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం ఆద్రా రైల్వే డివిజన్‌లో జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గూడ్స్ రైలు ఇనుము లోడ్‌తో టాటా నగర్ నుంచి పురులియా వైపు వెళ్తుండగా చాందిల్ స్టేషన్ సమీపంలోని పిటాకీ గేట్ 200 మీటర్ల దూరంలో పట్టాలు తప్పింది. అదే సమయంలో మరో గూడ్స్ రైలు ఢీకొట్టడంతో 21 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో ట్రైన్ డ్రైవర్లు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. యుద్ద ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. 200 మీటర్ల వరకు రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
- Advertisement -