Friday, April 19, 2024

ఒమిక్రాన్ లో మార్పులపై డబ్లుహెచ్‌ఒ ఆందోళన

- Advertisement -
- Advertisement -

Two Omicron sub-variants driving South Africa Covid spike

జెనీవా : కరోనా వేరియంట్ ఒమిక్రాన్ లో ఉత్పరివర్తనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అథనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 2 ఉనికి చాటుతున్నప్పటికీ , బీఏ 4,బీఏ 5 సబ్ వేరియంట్లు దక్షిణాఫ్రికాలో కొత్త ఉప్పెనకు దారి తీస్తున్నాయని వెల్లడించారు. చాలా దేశాల్లో ఈ వైరస్ ఎలా మార్పులు చెందుతుందో తెలుసుకోలేక పోతున్నామని , తర్వాత ఏం జరుగుతుందో తెలియదని వెల్లడించారు. ఈ వేరియంట్లపై మిగిలిన దేశాలు జన్యుక్రమాన్ని విశ్లేషించడాన్ని మానివేయగా, దక్షిణాఫ్రికా ఇంకా దానిని కొనసాగిస్తోందని, అందుకే వాటిని గుర్తించ గలిగామని వెల్లడించారు.

ప్రజలను రక్షించుకోడానికి మనముందున్న మార్గం వ్యాక్సినేషన్ అని, దాంతోపాటు కొవిడ్ నియమావళిని పాటించాలని సూచించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. గత వారం 15 వేల మరణాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య కరోనా ప్రారంభ రోజులు నాటి స్థాయికి పడిపోయినట్టు తెలిపింది. ఈ రెండేళ్ల కాలంలో 62 లక్షలకు పైగా మరణాలు సంభవించగా, వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తగ్గుదల సానుకూల పరిణామమే అయినప్పటికీ, పలు దేశాల్లో పరీక్షల సంఖ్య తగ్గడం కారణం కావొచ్చన్నారు. అలాగే అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కారణంగా కేసులు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News