Thursday, May 2, 2024

ఢిల్లీలో ఇద్దరు అక్కా చెల్లెళ్ల దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నైరుతి ఢిల్లీ ఆర్‌కెపురంలో ఆదివారం తెల్లవారు జామున ఆర్థిక వివాదంపై తలెత్తిన ఘర్షణ ఇద్దరి అక్కాచెల్లెళ్ల హత్యకు దారి తీసింది. మృతులు పింకీ ( 30), జ్యోతి (28)గా పోలీస్‌లు గుర్తించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులు ముగ్గురిని పోలీస్‌లు అరెస్టు చేశారు. ఆర్‌కె పురం అంబేద్కర్ బస్తీ ఏరియాలో మృతుల సోదరుడు లలిత్ కొందరికి ఇచ్చిన రుణం తిరిగి ఇవ్వాలని శనివారం సంబంధిత వ్యక్తులను అడగడంతో వాగ్వాదం చెలరేగింది. ఆదివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో అందరూ నిద్రలో ఉండగా, లలిత్ ఇంటికి నిందితులు వచ్చి కేకలేస్తూ,

తిడుతూ తలుపులు బాదడం మొదలెట్టారు. దీంతో లలిత్ సోదరుడు లాల్ భయపడి దగ్గరలో ఉన్న అక్కా చెల్లెళ్లను, బంధువులను పిలిచాడు. వారు వచ్చేసరికి నిందితులు అక్కడ నుంచి జారుకున్నారు. తరువాత నిందితులు పిస్టళ్లతో వచ్చి ఘర్షణకు దిగారు. సోదరుడు లలిత్‌పై దాడికి పాల్పడేసరికి అక్కా చెల్లెళ్లు అడ్డుకున్నారు. దాంతో పిస్టల్ కాల్పులకు వారిద్దరూ బలయ్యారు. ఈ సంఘటన రాజకీయ వివాదంగా మారింది. శాంతి భద్రతల పరిరక్షణ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News