Thursday, May 2, 2024

రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉక్రెయిన్ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Ukraine complaint to International Court of Justice against Russia

 

కీవ్ : రష్యాదాడులను నివారించడం కోసం హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం వెల్లడించారు. దురాక్రమణను సమర్ధించడానికి మారణహోమం భావనను మార్చడంపై రష్యా జవాబుదారీ కావాలని జెలెన్‌స్కీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. రష్యా తన సైనిక చర్యను తక్షణం ఆపేలా ఉత్తర్వు జారీ చేయడానికి ఇప్పుడు అత్యవసర నిర్ణయం తీసుకోవాలని తాము న్యాయస్థానాన్ని కోరుతున్నామని , దీనిపై వచ్చేవారం నుంచి విచారణ ప్రారంభమౌతుందని భావిస్తున్నట్టు ఆయన వివరించారు. నెదర్లాండ్స్ రాజధాని హేగ్ కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానానికి నాలుగు రోజుల రష్యాదాడికి సంబంధించి రష్యానేతలపై వ్యక్తిగతంగా ఆదేశించే బాధ్యత అంటూ ఏదీ లేదు. కానీ దేశాల మధ్య అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనలు జరిగినట్టు ఆరోపణలు వస్తే వాటిని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఉన్నత న్యాయస్థానంగా పరిష్కరించే బాధ్యత ఉంటుంది.

భద్రతామండలిలో రష్యా సభ్యత్వం తొలగించాలి

ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడిన రష్యాకు భద్రతామండలిలో సభ్యత్వం తొలగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం పిలుపునిచ్చారు. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న ఐదు దేశాల్లో రష్యా ఒకటి. తీర్మానాలను వీటో చేసే అధికారం రష్యాకు ఉంటుంది. అయితే ఉక్రేయిన్‌పై నరమేథానికి పాల్పడిన రష్యాకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి భద్రతా మండలిలో దాని స్థానం తొలగేలా ఉపక్రమించాలని ఆదివారం వీడియో సందేశం ద్వారా జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యాదాడులను అంతర్జాతీయ యుద్ధనేరాల ట్రిబ్యునల్ దర్యాప్తు చేయాలని కోరారు. ఉగ్రవాద దేశంలా రష్యా దుర్మార్గంగా దాడికి పాల్పడిందని ధ్వజమెత్తారు. పౌర నివాస ప్రాంతాలపై దాడులు చేయలేదని రష్యా చెబుతున్నవి అబదాలుగా ఆయన తోసిపుచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News