Thursday, May 2, 2024

నేడు ఖమ్మంలో నిరుద్యోగుల మార్చ్..

- Advertisement -
- Advertisement -

ఖమ్మం బ్యూరో : పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగులంతా తీవ్ర ఇబ్బందులకు గురైన నేపధ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదేశం మేరకు సోమవారం ఖమ్మం నగరంలో నిరుద్యోగుల మార్చ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి మయూరి సెంటర్ వరకు నిరుద్యోగుల ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఆయనతోపాటు టిపిసిసి, ఏఐసిసి ముఖ్యనేతలు పాల్గొంటారు. ఈ ర్యాలీ విజయవంతం కోసం టిపిసిసి, డిసిసి విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రతి నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన టిపిసిసి కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు.

వారు గత వారం రోజుల నుంచి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నిరుద్యోగులను ప్రధానంగా యవతీ, యువకులను సమీకరిస్తున్నారు. టిపిఎస్‌సి పేపర్ లీకేజీ సంఘటనలో ఖమ్మంనగరానికి చెందిన దంపతులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గ్రూప్ వన్, డివిజన్ అక్కౌంట్స్, ఏఈ పరీక్షలు రద్దైన దృష్ట్యా వాటిని వీలైంత తొందరగా నిర్వహించాలని ఇప్పటి వరకు ప్రకటించిన నోటిఫికేషన్ల పరీక్షలను ఇకపై పకడ్బందిగా నిర్వహించాలని, నిరుద్యోగులకు భృతి చెల్లించాలని, పరీక్షలు రద్దుతో నష్టపోయిన అభ్యర్థులకు సాయం చేయాలని తదితర డిమాండ్లతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ర్యాలీ అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో కార్నర్ బహిరంగ సభ జరుగుతుంది. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని డిసిసి నాయకులు విజ్ణప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News