Sunday, April 28, 2024

జిల్లాల్లోనే ఉచితంగా డే కేర్ కీమో థెరపీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి: క్యాన్సర్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నా రు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేట సర్వజన ఆసుపత్రిలో డే కేర్ కీమోథెరఫి సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి డే కేర్ కీమోథెరఫి సెంటర్‌ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రా రంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేటతో పాటు ఖమ్మం, కరీంనగర్, వనప ర్తి, సిరిసిల్లలో వీటిని మంజూరు చేసుకున్నామని తెలిపారు. 33 జిల్లాల్లో వచ్చే మెడికల్ కా లేజిల్లో ఏర్పాటు చేసుకునేలా ప్రణాళిక ఉందన్నారు. క్యాన్సర్ వ్యాధి తీవ్రత ఉన్న పేషెంట్లకు హైదరాబాద్ దాకా వెళ్లకుండా కీమో సేవ ల కోసం ఎదురు చేసే పరిస్థితి ఉండదన్నారు. ఇక్కడి సెంటర్‌లో 4 పడకలు ఉంటాయని తెలిపారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో శిక్షణ పొం దిన మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాప్ నర్స్‌లు ఉంటారన్నారు. 60 రకాల మందులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవి ఎంఎన్‌జే క్యాన్సర్ ఆ సుపత్రి నుంచి ఇక్కడికి సరఫరా అవుతాయన్నారు. ప్రతి పేషెంట్‌కు ఆ రు నుంచి ఎనిమిది సైకిళ్ల కీమో అవసరం ఉంటుంది.

షేపంట్ ఆరోగ్య పరిస్థ్ధితిని బట్టి ఒక్కో కీమో సైకిల్‌కి 3 నుంచి 54 వారాల గ్యాప్ అవస రం ఉంటుందన్నారు. ఒక్కో సైకిల్ నిర్వహించడానికి సగటున 5-6 గంటల సమయం పడుతుందన్నారు. ఒక్కో సైకిల్‌కు కార్పొరేట్ ఆసుపత్రిలో అయితే కనీసం 40 వేల నుంచి 50 వేల ఖర్చు అవుతుందన్నారు. మొత్తంగా 4 లక్షల విలువైన వైద్యం మీ చెంతనే ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి కీమో పేషెంట్ ,ప్రతి సైకిల్ సిబిఆర్, ఆఎఫ్‌టి, ఎల్‌ఎఫ్‌టి పరీక్షలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ పేషెంట్ డయాబెటిక్ అయితే ఎఫ్‌బిఎస్, పిఎల్‌బిఎస్ పరీక్షలు, కార్డియాక్ కేస్ అయితే ఈసిజి, 2డీ ఈసిహెచ్‌ఓ వంటి పరీక్షలు చేస్తారని తెలిపారు. నిమ్స్ ఎంఎన్‌జే ఆసుపత్రులు కీమోథెరఫి అవసరం అని రిఫర్ చేసిన 96 కేసులు ఇక్కడ కీమో సేవలు పొందే అవకాశం కలిగిందన్నారు. వీరికి ఇక్కడి నుంచి టెలి కన్సల్టేషన్ సేవలు కూడా అందుతాయని తెలిపారు. క్యాన్సర్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ర కాల చర్యలు తీసుకున్నదని అన్నారు. సిఎం కెసిఆర్ అదేశాలతో ప్రభు త్వం క్యాన్సర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ్ద వహించిందన్నారు.

క్యాన్సర్ వచ్చిన వారికి మెరుగైన చికిత్స అందించడం వారిని కాపాడుకోవడం లక్షంగా పని చేస్తుందన్నారు. జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి మొబైల్ స్క్రీనింగ్ నిర్వహిస్తుందన్నారు. మారు మూల ప్రాంతాలకు సైతం మొబైల్ స్క్రీనింగ్ సేవలు చేరువ చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా సగటున సంవత్సరానికి రూ. 100 కోట్లతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రభు త్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సేవలందిస్తున్నామన్నారు. 2014-/15లో 69 కోట్లు ఖర్చు చేసి గతేడాది రూ.120 కోట్ల దాకా ఖర్చుఅయింది. క్యా న్సర్ చికిత్సపై తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తంగా రూ.800 కోట్లు ఖర్చు చేసింది. ఎంఎన్‌జె, నిమ్స్ ఆసుపత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు అవసరమైన చికిత్స అందింతున్నాయన్నారు.పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచుకుంటున్నామని తెలిపారు. ఎంఎన్‌జె, నిమ్స్‌లో ఇప్పటికే ట్రుబీం పిఈటి స్కాన్ వంటి అదునాతన పరికరాలు ఏర్పాటు చేయగా ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో రోబోటిక్ సర్జరీ చేసే ఎనిమిది అత్యాధునిక మాడ్యులర్ థియేటర్ల ప్రత్యేక బ్లాక్‌ని ఎంఎన్‌జేలో ఏర్పాటు చేసుకున్నాం.

అవసాన దశలో ఉన్నవారికి సేవలు అందించేందుకు ఉదేశించిన పాలియేటివ్ కేర్ సేవలను 33 జిల్లాల్లో ఏర్పాటు చేసుకున్నామన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ పథకం ద్వారా జిల్లా స్థాయిలోనే క్యా న్సర్‌ను గుర్తించడానికి అవసరమైన మమ్మోగ్రఫీ, బయాప్సీ వంటి అత్యుధునిక సేవలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రజలలో అవగాహన కల్పించి క్యాన్సర్ రాకుండా అలవాట్లు మార్చుకోవడం పొగాకు, సిగరెట్లు మానడం, ప్రాథమిక పరీక్షలు చేయించుకోవడం రొమ్ము, గర్భాశయం సంబంధిత పరీక్షలు ద్వారా వ్యాధి రాకుండా చూడడం ఒకవేళ వచ్చినా దానిని త్వరతగతిన గుర్తించి చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవితం అలవాటు చేసుకోవాలన్నాఆరు.

మూడింట రెండొంతుల క్యాన్సర్లు మన గతి తప్పిన ఆహార ఆలవాట్లు పరిసరాల ప్ర భావంతో ముడిపినవే అన్నారు. సిగరేట్లు, బీడిలు, చుట్ట, గుట్కా, జర్ధాలకు దూరంగా ఉండాలన్నారు. వీలైనంత వరకు శాఖహారం తినటం మేలు ,మాంసాహారులైతే మితం పాటించాలన్నారు. శారీరక శ్రమ, వ్యాయాయం చేయడం వంటివి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జ డ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాదాకృష్ణశర్మ, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సెన్, కళాశాల ప్రిన్సిపల్ విమల థామస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ కిషో ర్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, ప్రజాప్రతినిధులు, నాయకులు కడవెరుగు రాజనర్సు, మారెడ్డి రవీందర్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కేమ్మాసరం ప్రవీణ్ కుమార్, సద్ది నాగరాజు రెడ్డి, సాయి గౌడ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News