Friday, August 8, 2025

ఉజ్వల యోజన సబ్సిడీ రూ.12000 కోట్లతో కొనసాగింపు

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపనీలకు (ఓఎంసీలు) కు 30 వేల కోట్ల సబ్సిడీని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దేశీయ ఎల్ పీజీ అమ్మకాలపై కంపెనీలకు కలిగే
నష్టాలను భర్తీ చేయడానికి ఈ సబ్సిడీని ఉద్దేశించారు. దీనిని 12 భాగాలుగా చెల్లిస్తారు.2025-26 ఆర్థికసంవత్సరానికి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంజెవై) వినియోగదారులకు రూ. 12 వేల సబ్సీడీని కొనసాగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. భారతదేశం అంతటా శుభ్రమైన వంట గ్యాస్ నిరంతరం వినియోగించుకునేలా ప్రోత్సహించడం ద్వారా లబ్దిదారులకు ఎల్ పిజి కనెక్షన్లు మరింత చౌకగా అందించడమే ఈ సబ్సిడీ లక్ష్యం.మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు సబ్సిడీలను అందించనున్నట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ తెలిపింది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్) భారత పెట్రోలియం కార్పొరేషన్ (బిపిసిఎల్) హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ ( హెచ్ పిసిఎల్) మధ్య పంపిణీ చేస్తుంది.

అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పుల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పిండడం, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు మద్దతు ఇవ్వడం ఈ నిర్ణయం లక్ష్యం అని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. చమురు, గ్యాస్ రంగాల్లో అనిశ్చితి కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.మధ్యతరగతికి వంటగ్యాస్ అందుబాటులో ఉండేలా చూడడం కోసం, రూ.30 వేల కోట్ల సబ్సిడీ ఆమోదించినట్లు తెలిపారు అశ్విని వైష్ణవ్ .ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన (పిఎంయువై) 2016 మే లో ప్రారంభమైంది. భారతదేశం అంతటా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, వయోజన మహిళలకు డిపాజిట్ లు లేకుండా ఎల్ పిజి కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా సాగుతోంది. 2025 జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా 10కోట్ల 33 లక్షల ఎంఎంయువై కనెక్షన్లు పంపిణీ చేశారు. ఉజ్వల యోజన సబ్సిడీ కొనసాగించడం వల్ల వినియోగదారుడు ఎటువంటి డిపాజిట్ లేకుండానే ఎల్ పిజి కనెక్షన్ అందుకుంటాడు.అంతేకాదు, సిలెండర్, ప్రెషర్ రెగ్యులేటర్, సేఫ్టీ హోస్, డమొస్టిక్ గ్యాస్ కన్స్యూమర్ కార్డు బుక్ లెట్ అందించడంతో పాటు ఇన్స్టలేషన్ చార్జీలకోసం సెక్యూరిటీ డిపాజిట్ ను కవర్ చేస్తుంది.

ఉజ్వల 2.0 పథకం కింద వినియోగదారుడు తన మొదటి స్టవ్, రీఫిల్ కూడా ఉచితంగా పొందుతారు.అంతర్జాతీయ ఎల్ పిజి ధరల అస్థిరత నుంచి ఉజ్వల్ యోజన వినియోగదారులను కాపాడేందుకు, క్రమబద్దీకరించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2022 మేలో లక్ష సబ్సిడీని ప్రవేశపెట్టింది. సంవత్సరానికి 12 రీఫిల్ లకు 14.2 కిలోల సిలెండన్ ను కేవలం 200 రూపాయలకే అందిస్తుంది. ఈ సబ్సిడీని 2023 అక్టోబర్ లో రూ.300 కు పెంచారు.ఉజ్వల యోజన లబ్దిదారులలో ఎల్ పిజి సగటు తలసరి వినియోగం (పిసిసి) క్రమంగా పెరిగింది. 2019-20లో మూడు రీఫిళ్లనుంచి 2022.23లో సగటు వినియోగం 3.68 కి పెరిగింది. 2024-25లో సుమారు 4.47 రీఫిల్ లకు చేరింది. ఇది వంటగ్యాస్ వినియోగంలో మహిళలు చూపుతున్న శ్రద్ధను ప్రతిబింబిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News