Friday, May 3, 2024

శస్త్ర పూజ చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్‌లో మంగళవారం దసరా సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైనికులతో కలిసి శస్త్ర పూజ చేశారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి దేశ సైనికుల సంసిద్ధతను సమీక్షించారు. ధైర్య సాహసాలతో సరిహద్దును కాపాడుతున్నారని సైనిక దళాలను ప్రశంసించారు. బమ్ లా, ఇతర సరిహద్దు పోస్ట్‌లను సందర్శించిన తరువాత సైనికులతో చర్చించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్టా దేశ రక్షణ సామర్థాన్ని పెంచుకోవడం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదన్నారు. దసరా అంటే చెడుపైమంచి విజయం సాధించడానికి సంకేతమని పేర్కొన్నారు.

తవాంగ్ యుద్ధ స్మారక చిహ్నాన్ని కూడా ఆయన సందర్శించారు. 1962లో చైనాతో యుద్ధం జరిగిన సందర్భంగా అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ సామగ్రిని తయారు చేయడం ద్వారా దేశ మిలిటరీ సామర్ధాన్ని పెంపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విదేశీ కంపెనీలు తమ సాంకేతికతను అందించేలా, స్వదేశీ రక్షణ సామగ్రిని తయారు చేసేలా ప్రోత్సహించడం జరుగుతోందని, చెప్పారు. 2014లో దేశ రక్షణ సామగ్రి ఎగుమతులు దాదాపు వెయ్యికోట్ల రూపాయల విలువైనవిగా ఉండగా, ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయల రక్షణ సామగ్రిని ఎగుమతి చేయగలుగుతున్నామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News