Friday, April 26, 2024

సారంగాపూర్ లో కాలువలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/సారంగాపూర్:  గుర్తు తెలియని మహిళ మృతదేహం ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకు వచ్చిన సంఘటన శుక్రవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల, గ్రామస్థుల కథనం ప్రకారం… మండలంలోని రేచపల్లి శివారు ప్రాంతంలో డి53 కెనాల్‌లో మహిళ మృతదేహం కొట్టుకు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సహాయంతో మహిళ మృతదేహాన్ని బయటకు తీసి గుర్తు తెలియని మృతదేహంగా గుర్తించారు. సుమారు మహిళ వయసు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందని, పొలం పనులకు వెళ్లిన మహిళ ప్రమాదవ శాత్తు కాలువలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు నలుపు రంగు జాకెట్, ఎరుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తించిన వారు సారంగాపూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

 

Unkown Dead Body Found in Canal in Jagtial district
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News