Saturday, April 27, 2024

నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు

- Advertisement -
- Advertisement -

Nirbhaya convicts

 

న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష తేదీని ఖరారు చేసింది. నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంతో, వీరికి ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష వేయాలని నిర్ణయించారు. నిన్న ముఖేశ్ సింగ్ పిటిషన్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించి, కేంద్ర హోం శాఖకు పంపించారు. దాన్ని కేంద్ర హోం శాఖ పరిశీలించి, దోషికి క్షమాభిక్ష పెట్టాల్సిన అవసరం లేదని రాష్ట్రపతికి వివరించింది. దీంతో.. రాష్ట్రపతి కూడా ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో నిందితులకు ఉరిశిక్ష ఖరారైంది. 2012, డిసెంబర్‌ 16న ముఖేష్‌సింగ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, రామ్‌ సింగ్‌తో పాటు మరో మైనర్‌ ఆరుగురు వ్యక్తులు కలిసి వైద్య విద్యార్థిని కదులుతున్న బస్సులో సామూహికంగా అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచారు. ఏ1 రామ్‌ సింగ్‌ తిహార్‌ జైలులో ఆత్మహత్య చేసుకోగా మైనర్‌ను జూవైనల్‌ హోంకు తరలించారు. మూడు సంవత్సరాల జూవైనల్‌ హోం అనంతరం 2015లో విడుదలయ్యాడు.

Final date fix for death sentence for Nirbhaya convicts
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News