Monday, May 13, 2024

మహిళతో పోలీస్ అధికారి అసభ్య ప్రవర్తన…. అడ్డొచ్చిన బంధువుపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

UP Police sexually harasses women

లక్నో: మహిళతో పోలీస్ అధికారి అసభ్యంగా ప్రవర్తించిడమే కాకుండా అడ్డొచ్చిన బంధువుపై కాల్పులు జరిపిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అజమ్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సర్వేశ్ అనే పోలీస్ అధికారి తన స్నేహితులతో కలిసి సరైమీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమల్‌పూర్ గ్రామ శివారులో మద్యం సేవిస్తున్నారు. ఓ మహిళ తన బంధువు కిషన్‌లాల్‌తో కలిసి పెళ్లి వేడుకకు వెళ్తుండగా మార్గమధ్యలో ఆమెతో పోలీస్ అధికారి అసభ్యంగా ప్రవర్తించాడు. బూతు మాటలు వద్దని వారించినందుకు కిషన్‌లాల్ పై పోలీస్ అధికారి కాల్పులు జరిపాడు. స్థానికులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహిళ, కిషన్ లాల్ ఫిర్యాదు మేరకు గొండా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News