Thursday, August 7, 2025

అన్యాయం, అసమంజసం: భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని దురదృష్టకరమైనదిగా భారత్ పేర్కొంది. అనేక ఇతర దేశాలూ తమ సొంత ప్రయోజనాలను చూసుకొంటున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేసింది.అదనంగా సుంకాల విధింపునుఅన్యాయం, అసమంజసమైనదిగా భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.‘ రష్యానుంచి భారత్ చమురు కొనుగోళ్లను అమెరికా లక్షంగా చేసుకుంది.ఈ వ్యవహారంపై మా వైఖరిని ఇదివరకే స్పష్టం చేశాం. మార్కెట్ అంశాలపై ఆధారపడే మా దిగుమతులు ఉన్నాయి.140 కోట్ల మంది దేశ ప్రజల ఇంధన భద్రతను నిర్ధరించడం మా బాధ్యత. ఇతర అనేక దేశాలు తమ సొంత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకొంటూ ఉండగా, భారత్‌పై అదనపు సుంకాలు విధించాలని అమెరికా నిర్ణయించడం దురదృష్టకరం, ఈ చర్యలు అన్యాయయం, అసంబద్ధమైనవని పునరుద్ఘాటిస్తున్నాం. మా జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకొంటాం’ అని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News