Wednesday, April 24, 2024

అమెరికా-దక్షిణ కొరియా భారీ యుద్ధ విన్యాసాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

US-South Korea military exercises begin

వాషింగ్టన్ : అమెరికాదక్షిణ కొరియా వాయుసేనలు సోమవారం అతి పెద్ద యుద్ధ విన్యాసాలను మొదలు పెట్టాయి. విజిలెంట్ స్ట్రామ్ పేరిట శుక్రవారం వరకు జరిగే ఈ విన్యాసాల్లో 240 యుద్ధ విమానాలు 1600 సార్టీలు నిర్వహించనున్నట్టు అమెరికా వాయుసేన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ వార్షిక కార్యక్రమంలో ఇన్ని సార్టీలు నిర్వహించడం ఇదే తొలిసారని పేర్కొంది. ఇప్పటికే ఈ ఏడాది రికార్డు స్థాయిలో క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా నుంచి వచ్చే ఏ ముప్పునైనా ఎదుర్కొనేందుకు ఇవి ఉపయోగపడతాయని అమెరికా, దక్షిణ కొరియా చెబుతున్నాయి. విజిలెంట్ స్ట్రామ్ విన్యాసాల్లో ఎఫ్ 35 వేరియంట్ స్టెల్త్ విమానాలు కూడా పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా నుంచి ఏరియల్ రీఫ్యూయలింగ్ ట్యాంక్ కూడా వచ్చింది. ఈ విన్యాసాలను ఉత్తర కొరియా ఖండించింది.

ఇవి తమ దేశంపై దాడికి సన్నాహాలుగా పేర్కొంది. ఇప్పటికే ఉత్తర కొరియా కూడా ఇక్కడ సైనిక విన్యాసాలను నిర్వహించింది. గత శుక్రవారం సముద్రం వైపు రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. అణ్వాయుధాలను ఉపయోగిస్తే ఉత్తర కొరియా ప్రభుత్వానికి అంతం తప్పదని అమెరికా ఇటీవల హెచ్చరించిన నేపథ్యం లోనే ఈ అస్త్ర పరీక్షలు జరగడం గమనార్హం. దక్షిణ కొరియా సరిహద్దుకు 60 కిమీ దూరం లోని గటోంగ్‌చోన్ నుంచి ఈ క్షిపణుల ప్రయోగం జరిగింది. ఆ అస్త్రాలు భూమి నుంచి 24 కిమీ ఎత్తులో 220 కిమీ దూరం ప్రయాణించినట్టు దక్షిణ కొరియా నిర్ధారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News