Friday, September 19, 2025

అతి తెలివితో హరీష్ రావు ప్రకటన: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

తమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి 35 వేల కోట్లు,సాగులోకి 4.47 లక్షల ఆయకట్టు అంటూ బి.ఆర్.యస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. తమ్ముడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాలని,చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పనులను పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మాట వాస్తవమే నన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హరీష్ రావు చెబుతున్నట్లుగా 35 వేల కోట్లతో తమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణం,4.47 లక్షల ఆయకట్టుకు సాగు నీరు అని చెబుతున్నదాంట్లో అణువంతు నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.అది పూర్తిగా నిరాధారపూరితమైనదని,ఆయన మాటలు సత్యదూరమైనవని, ఆయన మాటలు పూర్తి అబద్దాలు అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన అంచానల ప్రక్రియనే మొదలు పెట్టలేదని,

అటువంటప్పుడు హరిష్ రావు ఇవీ అంచనాలు అంటూ ఎలా నిర్దారణకు వచ్చారని ఆయన సూటిగా ప్రశ్నించారు. అన్నింటికీ అతి తెలివి తేటలు వినియోగించ కూడదని,ఇటువంటి అతితెలివి తేటలతో ప్రజా క్షేత్రంలో అభాసు పాలవుతారని హరీష్ రావు కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. సత్యదూరమైన ఇటువంటి ప్రకటనలు హరీష్ రావు అతి తెలివి తేటలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. ఇలాంటి ప్రకటనల పట్ల తెలంగాణా సమాజం అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ్మడిహట్టి బ్యారేజ్,చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్ ల నిర్మణాలకు సంబంధించిన అంచనాలు రూపొందించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనీ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి సాగు నీరు,ప్రజలకు తాగు నీరు అందించేందుకు పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతం చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ALso Read: అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News