Monday, May 13, 2024

గ్రేటర్‌లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్….

- Advertisement -
- Advertisement -

హెల్త్ సెంటర్లతో పాటు, 74 మొబైల్ వాహనాల ద్వారా టీకా పంపిణీ
ఇప్పటివరకు 90 శాతం మందికి మొదటిడోసు పూర్తి
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి టీకా వేస్తున్న వైద్యశాఖ సిబ్బంది
వ్యాక్సిన్ తీసుకున్న జాగ్రత్తలు పాటించాలని వైద్యాదికారుల సూచనలు

Mumbai BMC to launch home vaccination

మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో వైద్య ఆరోగ్యశాఖ మొదటి డోసు టీకా ఇప్పటివరకు 90శాతం మందికి పంపిణీ చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 74 మొబైల వాహనాలు ఏర్పాటు చేసి టీకా కావాల్సిన వారికి అక్కడే ఆధార్‌కార్డు ద్వారా కోవిన్ యాప్‌లో పేరు నమోదు చేసి టీకా పంపిణీ చేస్తున్నారు. థర్డ్‌వేవ్ పొంచి ఉందనే ప్రచారంతో నగరవాసులు వ్యాక్సిన్ కోసం బారులు తీరుతున్నట్లు వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ జనవరి 23 నుంచి ప్రారంభించి ముందుగా కరోనా వారియర్స్‌తో మొదలు పెట్టి దశలవారీగా టీకా పంపిణీ చేస్తూ ఏడు నెల కాల వ్యవధిలో 71లక్షలమందికి మొదటిడోసు, 18 లక్షల మందికి సెకండ్ డోసు వేసినట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.

మరో వారం రోజుల్లో మొదటి డోసు ప్రక్రియ పూర్తి చేస్తామని, తరువాత సెకండ్ డోసు వారికి సరిపడ టీకా నిల్వలు తీసుకొచ్చి రెండు నెలల్లో వారికి కూడా వ్యాక్సిన్ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్య సెంటర్లకు జనం పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో మొబైల్ వాహనాల ద్వారా టీకా ప్రక్రియ వేగం చేసినట్లు, సెకండ్ డోసు గడువు సమీపించిన వారికి కూడా టీకా వేస్తున్నామని, ఎక్కువశాతం మొదటి డోసు వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు, సమీప ప్రాంతంలో ఎవరైనా కూలీలు , భవన నిర్మాణ కార్మికులు ఉంటే వెంటనే వారికి టీకాపై అవగాహన చేసి, తీసుకునేలా చేయాలని స్దానిక ప్రజలను మొబైల్ వాహనాల వైద్యసిబ్బంది కోరుతున్నారు. మొబైల్ వాహనాల ద్వారా బస్తీ, కాలనీల్లో జనసమూహం ఉండే ప్రదేశంతో పాటు మార్కెట్లు, కార్యాలయాలు, బ్యాంకుల వద్ద వాహనం నిలిపి కావాల్సిన వారికి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు.

గ్రేటర్ మూడు జిల్లాలో 118 వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేసి టీకా వేశారు. ప్రస్తుతం ఆసెంటర్లతో పాటు మొబైల్ వాహనాల ద్వారా త్వరగా వ్యాక్సిన్ పంపిణీ చేసి నగర ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా చేస్తామని వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. నగరవాసులు వ్యాక్సిన్ వేసుకున్న కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలని, ముఖానికి మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి ఉండాలని నిర్లక్షం చేస్తే థర్డ్‌వేవ్ రెచ్చిపోతుందని, ఒకవేళ ప్రారంభమైతే ప్రమాదంగా మారే పరిస్దితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవి కూడా దగ్గు,జ్వరం, జలుబు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో వెంటనే డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లి టెస్టులు చేసుకుని వైద్యుల సూచనల ప్రకారం చికిత్స పొందాలని జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News