Thursday, May 2, 2024

15 నుంచి 18 ఏళ్ల వారికి జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు

- Advertisement -
- Advertisement -

Vaccine registration for 15 to 18 years old age

 

న్యూఢిల్లీ : దేశంలో 15 18 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకాలను అందించేందుకు కేంద్రం ప్రక్రియ మొదలు పెట్టింది. ఈ వయసు వారికి జనవరి 1 నుంచి కొవిడ్ యాప్ , వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్టు సోమవారం వెల్లడించింది. విద్యా సంస్థల ఐడి కార్డుల తోను, రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్టు కొవిడ్ ప్లాట్‌ఫామ్ చీఫ్ డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ వెల్లడించారు. వీరికి జనవరి 3 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఒమిక్రాన్ తీవ్ర వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ కూడా గతవారం జనవరి 3న టీకా పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇక అరవై ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై ముందు జాగ్రత్త (ప్రికాషన్) డోసు టీకా అందిస్తామని, ఆరోగ్య విభాగ సిబ్బందికి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు దీన్ని జనవరం 10 నుంచి ప్రికాషన్ డోసులు వేస్తామని ప్రకటించారు.
టీకా రిజిస్ట్రేషన్ ఇలా …
కొవిడ్ యాప్ లేదా వెబ్‌సైట్ లోకి వెళ్లి ఫోన్ నంబరును ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో మీ నంబరును వెరిఫై చేయాలి.
ఒక మొబైల్ నంబరుపై నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. (ఉదాహరణకు గతంలో తల్లిదండ్రులిద్దరూ కొవిన్ యాప్‌లో రిజిస్టరైన నంబరుతో వారి పిల్లల (15 18 ఏళ్ల మధ్యవారైతేనే ) పేర్లు నమోదు చేసుకోవచ్చు.
నంబరు వెరిఫై అయిన తరువాత రిజిస్ట్రేషన్ పేజీ వస్తుంది. అందులో పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
పిల్లలకు పాన్‌కార్డు, ఓటర్ ఐడీ వంటివి ఉండవు కాబట్టి … ఐడీ ప్రూఫ్‌గా ఆధార్‌నంబరును ఎంచుకోవాలి.ఒక వేళ ఆధార్ నంబరు ఇంకా తీసుకోని పిల్లలకు వారి పదో తరగతి స్టూడెంట్ ఐడీ నంబరును నమోదు చేయవచ్చు.
ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ బటన్ కన్పిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేసి వ్యాక్సినేషన్ కు స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం 15 18 ఏళ్ల వారికి కొవాగ్జిన్ టీకా ఒకటే అందుబాటులో ఉంది. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ది చేసిన జైకోవ్‌డి టీకాను కూడా 12 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు అనుమతి లబించింది. అయితే జైకోవ్ డీ టీకా పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ టీకా పంపిణీ మొదలు పెట్టినా తొలుత పెద్దలకు మాత్రమే ఇవ్వనున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News