- Advertisement -
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదు అని ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక అని, జగన్ అసెంబ్లీకి రాకపోతే మిగిలిన వైసిపి ఎమ్మెల్యేలను అస్లెంబీకి పంపాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ చిన్నపిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నారని చురకలంటించారు. వైసిపి హయాంలో చంద్రబాబుకు అవమానం జరిగితే ఆయన ఒక్కరే వాకౌట్ చేశారని, లిక్కర్ స్కామ్‌పై నివేదిక వచ్చాక మాట్లాడతానని అనిత స్పష్టం చేశారు.
- Advertisement -