మేషం: మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట శత్రువులు ఎక్కువవుతారు. మనం చేసే పనిలో తప్పులు వెతికేవారు ఎక్కువగా ఉంటారు. ఏ పని మొదలుపెట్టిన వెనక్కి వెళ్లడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలనం ఏర్పడుతుంది. మీ కష్టానికి ప్రతిఫలం అనేది తక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక సంబంధం చేతి వరకు వచ్చి చేజారి పోతుంది. దైవానుగ్రహం వల్ల మరొక మంచి సంబంధం కుదురుతుంది. విదేశాలలో ఉన్న వారికి మంచి ఉద్యోగం, గ్రీన్ కార్డు లభిస్తుంది. సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించి, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా రొటేషన్సు బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కొన్ని విషయాలలో మాత్రం ఏదో తెలియని మనోవేదన ఏర్పడుతుంది. మన అనుకున్న వాళ్లే మోసం చేస్తారు. ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేయండి. అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు ఎరుపు.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. చేస్తున్న పనిలో కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. చేపట్టిన ప్రతి పనిలో ఒడిదుడుకులు ఏర్పడుతాయి. ఋణాలు చేయవలసిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఋణ ఒత్తిడీలు అధికమవుతాయి. ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. ఉద్యోగం మారేటప్పుడు కూడా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం చేయడమా లేదంటే ఉద్యోగం మారడమా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక స్త్రీ వల్ల ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నమ్ముకున్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేశారు అనే బాధ మనోవేదన ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా భగవత్ సంకల్పమే అని మీ పని మీరు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థినీ విద్యార్థులు మెరిట్ మార్కులు సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన విషయం. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రే.
మిథునం: మిధున రాశి వారికి ఈ వారం వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా కొన్ని చికాకులు ఏర్పడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి మంచి అవకాశాలు చేజారి పోతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. రాజకీయరంగంలో రాణిస్తారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అంతగా కలిసి రావు. వ్యాపారంలో భాగస్వాముల తీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అయితే మీకున్న తెలివితేటలతో వ్యాపారం రంగంలో ముందుకు దూసుకుపోతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఎక్కువగా కష్టపడతారు. ఖర్చుల విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి సమయంగా చెప్పవచ్చు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు, వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధిస్తారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించి సుబ్రమణ్య పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు ఎరుపు.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా కలిసి వస్తుంది. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. కుటుంబంలో ఇతరుల జోక్యం అధిక మవుతుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అభివృద్ధి అనేది నిదానంగా ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. సినిమా రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. విహారయాత్రలు చేస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మీకు వచ్చిన మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. అతివిశ్వాసం అతి నమ్మకం ఎప్పటికీ పనికిరాదు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. విదేశాలకు వెళ్లాలన్న మీ కల నెరవేరుతుంది. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు మెరూన్.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రతి విషయంలో కూడా అందరిని నమ్మవద్దు. అప్పు ఇవ్వవద్దు. వచ్చిన ధనాన్ని సద్వినియోగ పరుచుకోండి. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. నూతన గృహం కొనుగోలు చేయాలని మీ కోరిక ఈ వారం నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా, వ్యాపార పరంగా మంచి పరిస్థితి గోచరిస్తుంది. చార్టెడ్ అకౌంటెన్స్ వారికి, లాయర్లకు వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు ఈ వారం ఓ కొలిక్కి వస్తాయి. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్యా రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యమైన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. ఉద్యోగపరంగా బాగుంటుంది ఉద్యోగంలో ఎటువంటి మార్పులు ఉండవు. వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేసే వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సలహాలు సూచనలు తీసుకోవాలి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థలం కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు. రాజకీయ జీవితం బాగుంటుంది. గడిచిన రెండు మూడు వారాల కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి, సుబ్రహ్మణ్య పాశుపత కంకణం చేతికి ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు ఎరుపు.
తుల: తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆర్థికపరమైన వ్యవహారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. బంధువులలో సఖ్యత ఏర్పడుతుంది. మీకు రావలసిన స్థిరాస్తులు ధనం మీ చేతికి అందుతాయి. వ్యాపార అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతారు. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీరు చేసే పనిలో కృషి ఫలిస్తుంది. మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎక్కువగా శ్రమిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం. ప్రతిరోజు గురు గ్రహ స్తోత్రాన్ని చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్లకు లాభాలు బాగుంటాయి. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోండి. కీలకమైన విషయాలలో మీ సొంత ఆలోచనలే శ్రేయస్కరం. వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను ఎక్కువగా సందర్శిస్తారు. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో కష్టేఫలి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. వ్యాపారం యొక్క అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన పరంగా అభివృద్ధి బాగుంటుంది. మంచి సంబంధం చూసి వివాహం చేయగలుగుతారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. ప్రేమ వివాహాలు కలిసి రావు. ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. కాలేయం సంబంధించి, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించి సుబ్రమణ్య పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా ఉన్న ఒడిదుడుకులను ఏమాత్రం లెక్కపెట్టకుండా అహర్నిశలు శ్రమించి అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. మీరు చెల్లించవలసిన ధనానికి గాను ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్.
ధనస్సు: ధనస్సు రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది. చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవడానికి లాయర్లను ఆశ్రయిస్తారు. నిత్యవసర సరుకులు అమ్మే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. బందు వర్గానికి అండగా నిలుస్తారు. ఆర్థికపరమైన అంశాల పట్ల దృష్టిని సారిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సానుకూల పడతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభ వార్తలు వింటారు. నూతన వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. మీపై ఈర్ష ద్వేషాలు ఎక్కువ అవుతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. చర్మ సంబంధిత వ్యాధులు ఇబ్బంది కలిగించే సూచనలు ఉన్నాయి. కొనుగోలు అమ్మకాలు వాయిదా వేస్తారు. మరిన్ని మంచి ఫలితాల కోసం సుబ్రమణ్య పాశుపత హోమం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చేసరికి 5 కలిసివచ్చే రంగు తెలుపు. మీ సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో హస్తమూలికా తైలంతో దీపారాధన చేయండి.
మకరం: మకర రాశి వారికి ఈ వారం మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక సర్దుబాట్లు నేర్పుగా చేయగలుగుతారు. ఎదుటివారు చెప్పేద ఆశాంతం వినండి అందువలన మీకు తెలియని కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలని భావిస్తారు. అప్పు చేయకపోవడమే నిజమైన పొదుపు అని భావిస్తారు. మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగిన వారికి కూడా ఈ సలహాలనే ఇస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. విదేశాలకు వెళ్లాలని మీ ఆలోచనలు బలపడతాయి. ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. విలువైన స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. పౌల్ట్రీ రంగం, హోటల్ వ్యాపారస్తులకు, కిరాణా వ్యాపారస్తులకు, నిత్యవసర సరుకులు అమ్మే వారికి ఈ వారం లాభాలు బాగుంటాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రేమ వివాహాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వచ్చిన సంబంధం చేతి వరకు వచ్చి చేజారి పోయే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు బిస్కెట్ కలర్.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. రాహు కేతుల ప్రభావంఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు పొందగలుగుతారు. కొత్తదనాన్ని కోరుకుంటారు. మీపై ఎవరైనా విమర్శ చేసిన అందులో నిజాన్నిజాలను పరిశీలించుకుంటారే గాని తిరిగి వారిని మీరు విమర్శించారు. ఎన్నడూ లేనంత సహనాన్ని ఈ వారం కనబరుస్తారు. విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీకు కలిసి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో హస్తమూలికా తైలంతో దీపారాధన చేయండి.
మీనం: మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉండటం ఊరట కలిగిస్తుంది. ఎవరో కూడా ఒక్కరోజే విజయాన్ని సాధించలేరు దేనికైనా సమయం కలిసి రావాలని మిమ్మల్ని మీరే ఓదార్చుకుంటారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు ఎవరికి హామీ ఉండవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చదివిన చదువుకు సంబంధం లేని ఉద్యోగం లభిస్తుంది. రాజకీయపరమైన జీవితం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, బ్యూటీ పార్లర్ నడిపే వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, అలంకార సామాగ్రి అమ్మే వారికి, నిత్యవసర సరుకులో అమ్మేవారికి, హోటల్ వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది. చెడు అలవాట్లకు స్నేహితులకు దూరంగా ఉండండి. గడిచిన రెండు మూడు వారాల కంటే ఈ వారం బాగుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించి సుబ్రమణ్య పాశుపత హోమం చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు ఎల్లో.