ప్రపంచ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ (Velkumar) చరిత్ర సృష్టించాడు. నార్వే వేదికగా జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆదివారం నిర్వహించిన 42 కి.మీ మెన్స్ మారథాన్‌లో స్వర్ణ పతకం గెలిచాడు. అంతకు ముందు 1000 మీటర్ల స్ప్రింట్‌లో స్వర్ణం, 500 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు విజేతగా నిలిచి తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే మూడు పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్ వేల్‌కుమార్ కావడం మరో విశేషం.
1000 మీటర్ల స్ప్రింట్‌తో పోలిస్తే.. 42 కి.మీ. మారథాన్ చాలా కష్టమైంది. అద్భుతమైన నైపుణ్యాలు ఉంటే కానీ ఇందులో విజయం సాధించలేరు. సుదీర్ఘంగా సాగే రేసును వ్యూహాత్మకంగా పూర్తి చేయాలి. అలా ఈ రేసులో విజయం సాధించి వేల్‌కుమార్ (Velkumar) ప్రపంచానికి తన సత్తా నిరూపించాడు.
Also Read : మంధాన శతకం వృథా.. ఆస్ట్రేలియాపై పోరాడి ఓడిన భారత్