Tuesday, May 14, 2024

స్టైలిష్ లుక్

- Advertisement -
- Advertisement -

Venkatesh in bloodthirsty in this Srikanth Addala film

 

ఎన్నో మరపురాని ఘన విజయాలను సాధించి ‘విక్టరీ’నే తన ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ దగ్గుబాటి ఆదివారం తన పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. ప్రస్తుతం ‘నారప్ప’గా పవర్‌ఫుల్, ఇంటెన్స్ రోల్‌లో కనిపిస్తున్న వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్‌ను శనివారం రాత్రి విడుదల చేశారు. ‘నారప్ప’ తర్వాత బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి ఆయన ‘ఎఫ్ 3’ చేయనున్న విషయం తెలిసిందే. కాగా బర్త్‌డే సందర్భంగా వెంకటేష్ న్యూ ఫోటోషూట్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ స్టిల్స్‌లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో… గడ్డంతో స్టైలిష్‌గా వెంకీ అదరకొడుతున్నాడు. రాబోయే సినిమాల్లో ఈ స్టైలిష్ లుక్‌తో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకులు, అభిమానులను అలరించనున్నాడని తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News