Wednesday, August 6, 2025

నేడు ఇడి విచారణకు విజయ్ దేవరకొండ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్స్‌ర్ల బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు సంబంధించి మనీలాండరింగ్ పై ఇడి దృష్టి సారించింది. ఈ క్రమంలో సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్స్‌ర్లు విచారణకు హాజరు కావాలంటూ ఇడి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సినీ నటుడు విజయ్ దేవరకొండ బుధవారం విచారణకు హాజరు కానున్నారు. విజయ్ దేవరకొండకు ఆగస్ట్ 6వ తేదీన విచారణకు రావాలని ఇడి నోటీసులు ఇచ్చింది. ఆగస్ట్ 11న నటుడు రానా, 13న మంచు లక్ష్మి విచారణకు రావాలని ఇడి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఇదే కేసులో జులై 30వ తేదీన ప్రకాశ్ రాజ్‌ను ఇప్పటికే ఇడి అధికారులు విచారించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News