Friday, March 7, 2025

జాతీయ మహిళా కమిషన్ చీఫ్‌గా విజయ కిషోర్ రహత్కర్

- Advertisement -
- Advertisement -

జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) కొత్త చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం శనివారం నియమించింది. “ సెక్షన్ 3, ఎన్ సిడబ్ల్యు  చట్టం, 1990 ప్రకారం  కేంద్ర ప్రభుత్వం జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ ని  నామినేట్ చేసిందని తెలుపడానికి ఎన్‌సిడబ్ల్యు ఆనందిస్తోంది.” అని మహిళా ప్యానెల్ ఎక్స్ పోస్ట్‌ లో పేర్కొంది.

రహత్కర్ పదవీకాలం వెంటనే ప్రారంభమవుతుంది. ఈ ప్రకటన గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించబడుతుంది. రహత్కర్ నియామకంతో పాటు  ప్రభుత్వం ఎన్‌సిడబ్ల్యుకి కొత్త సభ్యులను కూడా నియమించింది. ఎన్‌సిడబ్ల్యు చీఫ్‌గా ఉన్న రేఖా శర్మ పదవీకాలం ఆగస్టు 6తో ముగియడంతో విజయ కిషోర్ రహత్కర్ ఆ స్థానంలోకి వచ్చారు. ఆమె పదవీ కాలం మూడేళ్లు లేక ఆమెకు 65 ఏళ్లు నిండే వరకు ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News