Monday, May 13, 2024

మంచి వినోదాన్నిచ్చే ‘విజయ రాఘవన్’

- Advertisement -
- Advertisement -

‘Vijayaraghavan’ entertaining well

 

విజయ్ ఆంటోని హీరోగా డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘విజయ రాఘవన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ “దర్శకుడు ఆనంద్ కృష్ణన్ ఈ సినిమాను అ ద్భుతంగా తెరకెక్కించారు.

మదర్ సెంటిమెంట్, లవ్, రొమాన్స్, యాక్షన్… ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ను పక్కాగా మిక్స్ చేసి ఈ సినిమా రూపొందించారు. పూర్తి వినోదాత్మక చిత్రమిది. నా నెక్స్ట్ మూవీ ‘బిచ్చగాడు 2’ దర్శకత్వ బాధ్యతలను కూడా ఆనంద్ కృష్ణన్‌కు అప్పగించాను”అని అన్నారు. డైరెక్టర్ ఆనంద కృష్ణన్ మాట్లాడుతూ “మంచి ఔట్‌పుట్ కోసం ఈ సినిమాను పబ్లిక్ లొకేషన్స్‌లోనే చిత్రీకరించాము. నేను చెప్పిన కథ నచ్చి విజయ్ ఆంటోని ఈ సినిమాకు ఓకే చెప్పారు. విజయ్ ఆంటోని తన పాత్రలో అద్భుతంగా నటించారు. రామచంద్రరాజు విలన్ పాత్రలో ఒదిగిపోయారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మిక, రామచంద్రరాజు, కమల్ బోరా, భాషాశ్రీ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News