Thursday, May 2, 2024

కేజ్రీ నివాసం వద్ద నిబంధనల ‘ఉల్లంఘన’

- Advertisement -
- Advertisement -

జరిమానాలు విధించిన ఎన్‌జిటి
నివేదికలు సమర్పించకపోవడమే కారణం

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద పర్యావరణ పరిరక్షణ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఢిల్లీ అటవీ శాఖకు జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జిటి) రూ. 15 వేల జరిమానా విధించింది. నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై వాస్తవాల నిర్ధారణ కోసం గతంలో ఏర్పాటు చేసిన ఒక బృందం సరైన నివేదిక సమర్పించనందుకు అటవీ శాఖకు ఎన్‌జిటి జరిమానా విధించింది.

ట్రైబ్యునల్ గతంలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం తన నివేదికలు సమర్పించనందుకు ఢిల్లీ ప్రభుత్వానికి, పబ్లిక్ వర్క్ శాఖకు విడిగా రూ. 10 వేల జరిమానా కూడా ఎన్‌జిటి విధించింది. నంబర్ 6 (ముఖ్యమంత్రి నివాసం), 45=47 రాజ్‌పూర్ రోడ్ (దానికి ఆనుకుని ఉన్న ఆస్తులు) వద్ద కట్టడాల కోసం శాశ్వత, అశాశ్వత నిర్మాణాలు జరిపారని, ఇరవైకి పైగా చెట్లు కొట్టివేశారన్న ఆరోపణలకు సంబంధించిన పిటిషన్‌ను ఎన్‌జిటి విచారిస్తోంది.

వాస్తవ పరిస్థితి నిర్ధారణ నిమిత్తం ట్రైబ్యునల్ నిరుడు మే నెలలో ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. నిరుడు జూలై, అక్టోబర్‌లలో పదే పదే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కమిటీ తన నివేదికను సమర్పించలేకపోయిందని, నిరుడు నవంబర్‌లో కమిటీకి నాలుగు వారాల గడబువు ట్రైబ్యునల్ ఇచ్చిందని, కమిటీ నివేదిక సమర్పించకపోవడంతో తమ ముందు హాజరు కావలసిందిగా ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్విని ఆదేశించామని ఎన్‌జిటి చైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాత్సవ సారథ్యంలోని ధర్మాసనం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News