భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో 47 పరుగులు చేసిన కోహ్లి తన కెరీర్‌లో అద్భుత మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 27 వేల పరుగులను పూర్తి చేసుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో భారత బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. సచిన్ అంతర్జాతీయ కెరీర్‌లో 34,357 పరుగులు సాధించాడు. కోహ్లి 27000 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఇలాంటి ఫీట్‌ను సాధించారు.
శ్రీలంక స్టార్ కుమార సంగక్కర (28,016), ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (27,012)లు కూడా కెరీర్‌లో 27000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఇది క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27 వేల పరుగులను పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి కొత్త రికార్డును సృష్టించాడు. కోహ్లి 594 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. కాగా, సచిన్ 623 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. కాగా, భారత క్రికెట్‌లో కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కెరీర్ ముగిసేలోగా అతను మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.