Friday, August 8, 2025

కోహ్లీ ప్రాక్టీస్ షురూ.. అలా చూడలేకపోతున్నాం అంటున్న ఫ్యాన్స్

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డుల రారాజు. క్రికెట్ చరిత్రలో ఎవరికి సాధ్యం కాని ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అందుకే అతనంటే భారతీయులే కాదు.. విదేశీ క్రికెట్ అభిమానులు కూడా అంత ఇష్టపడుతుంటారు. అయితే విరాట్ గత ఏడాది టి-20 ఫార్మాట్‌కి, ఈ ఏడాది సుదీర్ఘ టెస్ట్ ఫార్మాట్‌కి గుడ్‌ బై చెప్పేశాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ ఇంకా కొనసాగుతుండటం వారికి కాస్త ఊరటనిచ్చింది. తాజాగా క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టేందుకు కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు.

అందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ సహాయక కోచ్ నయీమ్ అమిత్‌తో కలిసి లండన్‌లోని ఓ ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పటి ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. ‘సోదరా.. నాకు సహాయపడుతున్నందుకు కృతజ్ఞతలు. ఎప్పుడు నిన్ను చూడటం ఆనందంగా ఉంటుంది’ అని ఆ ఫోటోకి కోహ్లీ (Virat Kohli) క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ ఫోటోలో కోహ్లీ చూడటానికి ఫిట్‌గా కనిపించినప్పటికీ.. తెల్లగడ్డంతో ఉన్నాడు. దీంతో అభిమానులు కోహ్లీని అలా చూడలేకపోతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘నువ్వు పెద్దవాడివై పోతున్నావంటే మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు ఎల్లప్పుడూ యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్‌లోనే ఉండాలి’ అని అంటున్నారు.

కాగా, అక్టోబర్ 19 నుంచి టీం ఇండియా.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసమే కోహ్లీ ప్రాక్టీస్ ప్రారంభించాడు. అసలు టిం ఇండియా ఆగస్టులో బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News