Tuesday, March 21, 2023

కోదండ రాముడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధప్రదేశ్‌లో ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి బ్రహ్మోత్సవాలకు ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈనెల 20నుంచి 28వరకూ ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉదయం ఉత్సవ మూర్తులను అలంకరించి తోమాల సేవతో మొదలు, సాయంత్రం సేనాధిపతి సేవలను ఘనంగా నిర్వహించారు. రాత్రి మేదినీపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తిరుమల శ్రీ పెద్దజియ్యర్ స్వామి, చిన్న జియ్యర్ స్వామి, ఈవో నాగరత్న, ఏఈవో మోహన్ తదితరులు పాల్గొన్నారు.సోమవారం ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News