Friday, May 3, 2024

వర్మ ‘వ్యూహం’ సినిమాకు హైకోర్టు బ్రేక్

- Advertisement -
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘వ్యూహం’ సినిమాకు మరో ఆటంకం ఎదురైంది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ ను జనవరి 11 వరకూ సస్పెండ్ చేస్తూ తెలంగాణా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై విచారణను కూడా జనవరి 11కు వాయిదా వేసింది.

వ్యూహం సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సూరేపల్లి నంద గురువారం విచారణ జరిపారు. సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం రాత్రి 11.30 గంటల సమయంలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ ను ఆయన సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు ‘వ్యూహం’ చిత్ర నిర్మాత, దర్శకుడు ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఈ సినిమాను రూపొందించారని లోకేశ్ తరఫు న్యాయవాదులు శ్రవణ్ కుమార్, మురళీధరరావు వాదించారు. దర్శక నిర్మాతలకు ఆర్థికంగా ఒక నాయకుడు సహకారం అందిస్తున్నారని వారు ఆరోపించారు. అయితే నిర్మాతల తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తూ, ట్రయలర్ ను చూసి సినిమాను నిలిపివేయాలని కోరడం సమంజసం కాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News