- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో కుండపోతగా కురిసిన వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలాశయాలుగా మారాయి. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచాయి. రోడ్లపై నడుముల్లోతు నీళ్లు రావడంతో ఎక్కడి వాహనాలు అక్కడి ఆగిపోయాయి. ఆపార్ట్ మెంట్ల సెల్లార్లు నీళ్లతో నిండిపోయాయి. మణికొండ పుప్పాలగూడలో 35 అడుగుల గోడ కూలిన. 2008లో శివాలయానికి ఆలయ కమిటీ రక్షణ గోడగా నిర్మించింది. రాత్రి భారీ వర్షానికి ఆకస్మాత్తుగా రక్షణ గోడ కూలిపోయింది. మట్టి దిబ్బలతో మూడు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
- Advertisement -