Tuesday, April 30, 2024

నీటి సరఫరాలో గొప్ప ప్రగతిని సాధించాం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది కాలంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మంచి నీటి సరఫరాలో గొప్ప ప్రగతిని సాధించమని కరీంనగర్ మేయ ర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజు నగరపాలక సంస్థ ఆద్వర్యంలో మంచి నీళ్ళ పండగ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సం దర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ నగరంలోని నగరపాలక సంస్థ నీటీ శుద్దీకరణ కేంద్రంలో మేయర్ యా దగిరి సునీల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్, పాలకవర్గ సభ్యుల సమక్షంలో నీళ్ళ పండగ వేడుకలు జరిగాయి. తెలంగాణ ప్ర భుత్వంలో మిషన్ భగీరథ ద్వారా నగర ప్రజలకు ప్రతి రోజు మంచి నీటిని సరఫరా చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వానికి కరీంనగర్ నగర ప్రజలు మాపాలకవర్గం పక్షాణ మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గత ప్రభుత్వాల పాలనలో త్రాగు నీటి కష్టాలు అనుభవించి గుక్కెడు నీటి కోసం బిద్దెలతో కొట్టాడుకున్న పరిస్థతులను చవిచూశామన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజల కష్టాలు, ఇబ్బందు లు గట్టెక్కాయని అన్నారు. నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగంలో ప్రస్తుతం 4 లక్షల 12 వేల మంది జనాభకు 80 ఎంఎల్ డీ సామర్థ్యం కలిగిన ఫిల్టర్ బెడ్ నుండి ప్రతి రోజు ప్రజలకు నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

గత 2014 సంవత్సరంలో 48 ఎంఎల్ డి సామర్థ్యం కలిగిన ఫిల్టర్ బెడ్ నుండి నీటి సరఫరా చేయగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా నూతన పాలకవర్గలో ప్రజలకు ప్రతి రోజు మంచి నీరు అందించాలన్నా గొప్ప లక్ష్యంతో 135 కోట్ల రూపాయల తో అర్బన్ మిషన్ భగీరథ ద్వారా అదనంగా మరో 36 ఎంఎల్ డి సామర్థ్యం కలిగిన ఫిల్టర్ బెడ్ నిర్మాణం, మొయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేస్కోని ప్రతి రోజు ప్రజలకు నీరు అందిస్తున్నట్లు తెలిపారు.

అంతే కాకుండా నీటి సరఫరా లో ఇబ్బందులు రాకుండా ఫిల్టర్ బెడ్ లో 370 హెచ్ పి 6 మోటారు పంపులు, 1500 కేవిఏ జనరేటర్, ప్రత్యేక ట్రాన్స్ పార్మర్ ఏర్పాటు చేసుకొని 133 కీ, మి మేర నూత మంచి నీటి పైపులైన్ నిర్మాణం చేసి 65 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రజలకు నీరు అందిస్తున్నట్లు తెలిపారు.

అంతే కాకుండా మార్కెట్, కోర్టు రిజర్వాయర్ల వద్ద కొత్త మోటారు పంపులు, భగత్ నగర్ రిజర్వాయర్ వద్ద నూతన పంపు హౌజ్ నిర్మాణం పంప్ సెట్లు, ఉజ్వల పార్కు వద్ద గల భూస్టర్ల వద్ద రావాటర్ కోసం 60 హెచ్ పి సామర్థ్యం గల నాలుగు మోటారు పంపు సెట్లు, సుమారు 40 కీ. మీ మేర నూతన డిస్ట్రిబ్యూషన్ లైన్ నిర్మాణం చేసి నీటి సరఫరా ను బలోపేతం చేశామన్నారు. రాష్ట్రంలో నే కాదు దేశంలోనే ఏ నగరం కూడా ప్రతి రోజు మంచి నీరు సరఫరా చేయడం లేదన్నారు.

మంచి నీటి సరఫరా విభాగం లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీరి కృషి పలితం వల్ల ప్రజలకు విజయవంతంగా నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News