Thursday, May 2, 2024

అలా చేస్తే లాక్ డౌన్ అవసరం ఉండదు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

We Won't impose lockdown in Delhi: CM Kejriwal

న్యూఢిల్లీ: ప్రస్తుతానికి ఢిల్లీలో లాక్ డౌన్ విధించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇటీవల కరోనా బారిన పడిన సిఎం కేజ్రీవాల్‌ కోలుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రజలు మాస్క్‌లు ధరించి కోవిడ్ నియమాలు పాటిస్తే లాక్ డౌన్ అవసరం ఉండదు. కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈరోజు హెల్త్ బులెటిన్‌లో దాదాపు 22,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదు. గత వేవ్‌లోని డేటాను విశ్లేషించిన తర్వాత చెబుతున్నాం. ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది అని పేర్కొన్నారు.

We Won’t impose lockdown in Delhi: CM Kejriwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News