Thursday, May 2, 2024

వుహాన్ మార్కెట్‌లో కరోనా మూలాలపై పరిశోధన

- Advertisement -
- Advertisement -

WHO experts visited meat market in city of Wuhan

 

వుహాన్ : చైనా లో కరోనావైరస్ మూలాలను కనుగొనడానికి బయలుదేరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఆదివారం వుహాన్ నగరం లోని అతిపెద్ద మాంసం మార్కెట్‌ను సందర్శించింది. గత ఏడాది 76 రోజుల లాక్‌డౌన్ సమయంలో ఈ మార్కెట్ కేంద్రం గానే చైనా ప్రభుత్వం వుహాన్ లోని ప్రతి ఇంటికి ఆహారాన్ని సరఫరా చేసింది. ఈ బృందం ఈ బైషజొయు మార్కెట్ విభాగాలను చైనా అధికారులు, మార్కెట్ ప్రతినిధులు వెంటరాగా నిపుణుల బృందం పరిశీలించింది. ఈ బృందంలో పశువైద్యులు, వైరస్ వ్యాధుల శాస్త్రవేత్త, ఆహార భద్రత,సాంక్రమణ వ్యాధుల వైద్య నిపుణులు ఉన్నారు. వీరింతవరకు వుహాన్ లోని జిన్‌యున్‌టాన్ ఆస్పత్రిని, హుబెయి ఇంటిగ్రేటెడ్ చైనీస్ అండ్ వెస్టర్న్‌మెడిసిన్ ఆస్పత్రిని సందర్శించారు. కరోనా వైరస్ తొలి దశలో ఈ ఆస్పత్రుల్లో కేసులు నమోదయ్యాయి. అలాగే ఓ మ్యూజియంను శనివారం సందర్శించి కరోనా తొలిదశ వివరాలను సేకరించారు. సీఫుడ్ మార్కెట్, వైరాలజీ ఇనిస్టిట్యూట్ లేబొరేటరీలను కూడా బృందం సందర్శించ నున్నట్టు గత గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్విటర్‌లో తెలియచేసింంది.

ప్రపంచ మంతా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి చైనా నిర్లక్షమే కారణమని ప్రపంచంలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ బృందం పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శాస్త్రవేత్తల బృందం ఏకైక పర్యటన వైరస్ మూలాలను నిర్ధారించే అవకాశం లేదు. జంతువుల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందిందని నిర్ధారించడానికి జంతు నమూనాల సేకరణ, జన్యువిశ్లేషణ, వైరస్ సాంక్రమణ ఇవన్నీ అధ్యయనం చేయాలంటే కొన్నేళ్లు పడుతుంది. అయితే వన్యప్రాణుల వేటగాడు వుహాన్ లోని జంతుమార్కెట్ వ్యాపారులకు వైరస్‌ను వ్యాపింప చేసి ఉండవచ్చు అన్న అభిప్రాయం కలుగుతోంది. చైనా ప్రభుత్వం మాత్రం సముద్ర ఉత్పత్తుల దిగుమతుల వల్ల వైరస్ వ్యాప్తి చెంది ఉండవచ్చని సాక్షాధారాలతో చెబుతోంది. ఈ అభిప్రాయాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, సంస్థలు తోసిపుచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News