Wednesday, August 6, 2025

యూట్యూబ్‌లో చూసి భర్త మర్డర్‌కి స్కెచ్.. చెవిలో గడ్డి మందు పోసి..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ఈ మధ్యకాలంలో భార్యలు ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేస్తున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్‌లో (Karimnagar) ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. యూట్యూబ్‌లో చూసి భర్తను ఎలా చంపాలో భార్య ప్రియుడికి చెప్పింది దీంతో అతను భర్తకు మద్యం తాగించి.. చెవిలో పురుగుల మందు పోసి హత్య చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లు భర్త కనబడటం లేదంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకెళ్తే.. భార్య రమాదేవి కరీంనగర్ జిల్లా (Karimnagar) కేంద్రంలోని గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేస్తుంది. తన, ఇరవై ఏళ్ళ వయసు దాటిన కొడుకు, కూతుర్లను భర్త సంపత్(45) పోషిస్తున్నాడు. భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండగా, తరచూ ఆమె వద్ద సర్వపిండి కోసం వచ్చే కర్రె రాజయ్య(50) ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. వీరి పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఎలాగైనా సంపత్ అడ్డు తొలగించుకోవాలని యూట్యూబ్‌లో చూసి భార్య రమాదేవి పథకం వేసింది. ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని యూట్యూబ్‌లో చూసింది.

అదే పద్ధతిలో హత్య చేయాలని ప్రియుడికి రమాదేవి సూచించింది. దీంతో పార్టీ చేసుకుందామని పిలిచి బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద సంపత్‌తో కలిసి రమాదేవి ప్రియుడు రాజయ్య, అతని స్నేహితుడు శ్రీనివాస్ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో సంపత్ తూలుతూ కింద పడిపోగానే చెవిలో గడ్డి మందు పోసి అతన్ని హత్య చేశారు. సంపత్ చనిపోగానే రమాదేవికి ఫోన్ చేసి చెప్పాడు రాజయ్య. ఆ మరుసటి రోజు భర్త కనిపించడంలేదని రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 1వ తేదీన మృతదేహం దొరికిందని తామే పోలీసులకు తెలిపారు. భర్త మృతికి కారణాలు తెలుసుకోకుండా, మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దని అడగడంతో రమాదేవిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సిసిటివి ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్టు రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ అంగీకరించారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News