Friday, September 19, 2025

భర్త వేధింపులు తాళలేక కత్తితో పొడిచిన భార్య

- Advertisement -
- Advertisement -

భర్త వేధింపులు భరించలేక భార్య హత్య చేసిన సంఘటన నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం నుంచి బతుకు దెరువు కోసం వచ్చిన భరత్ బరోడా, కృష్ణ జ్యోతి బరోడాలు నగర శివారులోని కోకాపేట్లో జీవనం సాగిస్తున్నారు. కాగా భర్త నిరంతరం వేధింపులకు గురి చేస్తుండటంతో విసుగు చెందిన మహిళ భర్తపై కత్తితో దాడి చేసింది. దీంతో ఆమె భర్త రక్తపు మడుగులో అపాస్మారక స్థితిలో పడిపోయాడు. భర్త కేకలు విని స్థానికులు లోపలకు వచ్చారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న భర్త ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా గాయలకు గురైన భరత్ బరోడా ఆసుపత్రిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News