Thursday, May 2, 2024

రోహిత్ వీర విహారం.. రికార్డులు బద్దలు కొట్టిన హిట్‌మ్యాన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌తో బుధవారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. 63 బంతుల్లోనే సెంచరీ పూర్తి వరల్డ్‌కప్‌లో అత్యంత వేగంగా శతకం సాధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 84 బంతుల్లోనూ 16 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. అంతేగాక వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ వరల్డ్‌కప్‌లో ఏడో సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆరు శతకాల రికార్డును బద్దలు కొట్టాడు.

దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు. విండీస్ స్టార్ క్రిస్ గేల్ పేరిట ఉన్న 553 అత్యధిక సిక్సర్ల రికార్డును హిట్‌మ్యాన్ తిరగరాశాడు. ఇవే కాకుండా వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ప్రస్తుతం 31 శతకాలతో మూడో స్థానంలో నిలిచాడు. భారత స్టార్లు సచిన్ (49), కోహ్లి (47) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అంతేగాక వన్డే వరల్డ్‌కప్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని కూడా రోహిత్ అందుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News