Wednesday, April 24, 2024

ఉరుముతున్న ఊబకాయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతదేశంలోని బాలల్లో ఊబకాయం శాతం వార్షిక పెరుగుదల నమోదు కానుంది. ప్రపంచ స్థూలకాయ దినోత్సవా న్ని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రపంచ అధ్యయనం ప్రకారం నివారణ, చికిత్స మెరుగుపడకపోతే దేశంలోని బాలలు ఊబకాయ సమస్యను ఏదుర్కోక తప్పదు. ప్రతి ఏటా 9.1శా తం ఊబకాయులు పెరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఏటా మార్చి ప్రపం చ ఊబకాయ దినోత్సవం నిర్వహిస్తారు. ప్రజలు ఆరోగ్యకరమైన బరువును సాధించి ఊబకాయ సంక్షోభాన్ని నివారించడం, ఆ దిశగా చర్యలను ప్రోత్సహించడం, మద్దతు ఇవ్వడం లక్షం గా ప్రపంచ ఊబకాయ దినోత్సవాన్ని జరుపుతున్నారు. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ నివేదిక ప్రకారం ఊబకాయ నివారణ, చికిత్స మెరుగుపడకపోతే ప్రపంచ జనాభాలో సగానికిపైగా అధిక బరువుతో ఊబకాయ సమస్యను ఎదుర్కొంటారు. భారతదేశంలో 2035 నాటికి 11శాతం మంది ఊబకాయంతో ఉంటారని నివేదికలో పేర్కొన్నారు. 2020 నుంచి 2035మధ్య ఊబకాయం వార్షిక పెరుగుదల 5.2శాతంగా అధ్యయనం పేర్కొంది.

ప్రపంచ ఊబకాయ అట్లాస్ 2023నివేదిక ప్రకారం భారతదేశంలోని బాలల్లో 2020లో ౩శాతం ఊబకాయ సమస్య పెరగనుం ది. అదేవిధంగా 2020లో బాలికల్లో 2శాతం ఉన్న ఈ సమస్య రాబోయే 12ఏళ్లలో 7శాతానికి పెరగునుంది. భారతీయ మహిళల్లో 2020లో 7శాతం ఉ న్న ఊబకాయం సమస్య పెరగనుంది. అదేవిధంగా పురుషుల్లో 4శాతం నుంచి రెట్టింపు అంటే 8శాతానికి పెరగనుంది. కాగా స్థూలకాయ నివారణ, చికిత్స మెరుగుపరుచుకోవడంలో ట్రిలియన్ డాలర్లు ఆర్థిక ప్రభావం పడనుందని అధ్యయనం అంచనా ఇది ప్రపంచ జిడిపిలో దాదాపు 3శాతం సమానం. భారతదేశపు జిడిపిపై 1.8శాతంగా తెలిపింది. తక్కువ ఆదాయ దేశాల్లో ఊబకాయ ప్రాబల్యం పెరగడానికి ప్రధాన కారణాలు అధికంగా చేసిన ఆహార పదార్థాలను వినియోగించడం, శారీరక శ్రమ తగ్గడం, ఆహార సరఫరా, మార్కెటింగ్‌ను నియంత్రించే బలహీన విధానాలుగా అధ్యయనం పేర్కొంది.

ప్రస్తుత సూలకాయం సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలును ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉందని ఒబెసిటీ హెచ్చరించింది. పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో ఊబకాయం వేగంగా పెరగడం ఆందోళన కలిగిస్తుందని వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ అధ్యక్షుడు లూయిస్ బౌర్ అన్నారు. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు యువతరం ఆరోగ్యవంతంగా ఉండేలా ఊబకాయ నివారణకు చిత్తశుద్ధితో సత్వర చర్యలు చేపట్టాలి. కాగా అట్లాస్ తమ నివేదికను మార్చి యూఎన్ విధానకర్తలు, సభ్యదేశాల ఉన్నతస్థాయి కార్యక్రమంలో అందించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News