Sunday, April 28, 2024

యుద్ధం తరువాత ఉక్రెయిన్ తదుపరి అధ్యక్షుడు యనుకొవిచ్ ?

- Advertisement -
- Advertisement -

Yanukovych is next president of Ukraine after war

నేరచరిత్ర ఉన్నా, గతంలో బహిష్కరణకు గురైనా సరే….

మాస్కో : ఉక్రెయిన్‌పై రష్యా ఇలాగే భీకర పోరును కొనసాగిస్తే …చివరకు ప్రస్తుత ప్రభుత్వం పతనమైతే, గతంలో బహిష్కరణకు గురైన ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టోర్ యనుకొవిచ్‌కు మళ్లీ ఉక్రెయిన్ పీఠం దక్కే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పర్గాల అంచనా. ఆయనకే మద్దతు ఇచ్చి తన చెప్పుచేతల్లో ఉక్రెయిన్ పాలన సాగించడానికి పుతిన్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. యనుకొవిచ్ రెండు సార్లు గతంలో పదవి నుంచి వైదొలిగారు. ఉక్రెయిన్‌స్కా ప్రావ్దా అనే పత్రిక కథనం ద్వారా ఈ అంచనాలు తెరపైకి వస్తున్నాయని కీవ్ ఇండిపెండెంట్ ట్వీట్ చేశారు. కమ్మరం కార్మిక కుటుంబానికి చెందిన యనుకొవిచ్ 1950 లో యెనకియెవోలో జన్మించారు. యువకునిగా ఉన్నప్పుడు ఘోరమైన నేరాలకు పాల్పడడంతో రెండుసార్లు జైలు పాలయ్యాడు. అయినా సరే అవన్నీ పక్కన పెట్టి అతనికే పట్టం కట్టడానికి పుతిన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News