Saturday, May 4, 2024

యేసు సూక్తి… ప్రేమ, క్షమాగుణం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Yesu prabhu prarthana telugu

సిద్దిపేట: యేసు ప్రభువు సూచించిన సూక్తి.. అందరినీ ప్రేమించి, క్షమగుణాన్ని కలిగి ఉండాలని చెప్పారని, ప్రతీ వ్యక్తి సమాజంలో ఆనందంగా గడపాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. సిద్ధిపేట పట్టణంలో ప్రసిద్ధి గాంచిన సిఎస్‌ఐ చర్చిలో శనివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవ మత పెద్దలు ఏసు క్రీస్తును కీర్తిస్తూ ఆరాధన మహోత్సవం, ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ రోజు చాలా సుదినం అని, భువి నుంచి దివికి యేసు ప్రభువు వచ్చిన రోజును క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నట్లు తెలిపారు.

యేసు ప్రభువు చెప్పిన సూక్తులు బైబిల్ లో చదవడమే కాదు అని, ఆచరించాలని కోరారు. ప్రార్థనలో అవకాశం కల్పించిన అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు. ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను, క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజని పేర్కొన్నారు. ఆనందోత్సహాలతో ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు.

ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకగా దుస్తులు పంపిణీ చేసిందని తెలిపారు. యేసు ప్రభు దీవెనలతో సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ పండుగను కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో వేడుకగా జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, పోలీసు కమిషనర్ జోయడ్ డేవిస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News