Saturday, April 27, 2024

క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన ఖమ్మం చర్చిలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం కల్చరల్: క్రిస్మస్ వేడుకలకు ఖమ్మం నగరంలో పలు చర్చిలు ముస్తాబయ్యాయి. ఖమ్మం నగరంలో దాదాపు 45 చర్చిలు ఉన్నాయి. ప్రధానంగా మామిళ్లగూడెంలోని మన్నా పెంతుకోస్తు చర్చి ముస్తాబైనట్లు చర్చి పాస్టర్ రెవ, నెహెమ్యా తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున ౩.౩0 గంటలకు పండుగ ఆరాధన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్బంగా క్రిస్మస్ కేరల్స్‌తోపాటు పిల్లల నాట్యాలు, పాటలు ఉంటాయన్నారు. సీనియర్ పాస్టర్ బిషప్ కె జ్ఞానప్రకాశంచే క్రిస్మస్ సందేశం ఉంటుందని, తరువాత క్రిస్మస్ కేక్ కట్‌చేయడం, ప్రత్యేక ప్రార్దనలు ఉంటాయని చెప్పారు.

గెత్సెమనే చర్చిలో రెండు పండుగ ప్రత్యేక ఆరాధనలు

ఖమ్మం నగరంలోని అల్లీపురం రోడ్‌లోని గెత్సెమనే చర్చిలో క్రిస్మస్ సందర్బంగా రెండు ప్రత్యేక పండుగ ఆరాధనలు నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రాజేష్ తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకు తిరిగి ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ పాస్టర్ డి ఇర్మియా పాల్గొని దైవసందేశం ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం క్యాండిల్‌ సర్వీస్, కేక్ కటింగ్, సంగీత ఆరాధన, పిల్లల కార్యక్రమాలు ఉంటాయన్నారు. నగరంలోని పంపింగ్‌ వెల్‌రోడ్‌లోని కూడా క్రిస్మస్ ఆరాధనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రోటరీనగర్ గుడ్ షప్పర్డ్ చర్చిలో…

ఖమ్మం నగరంలోని రోటరీగుడ్ షప్పర్డ్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాస్టర్ రెవ బి సత్యపాల్ తెలిపారు. ఈ సందర్బంగా రెండు ఆరాధనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 4.30 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటలకు ఈ ప్రార్దనలు ఉంటాయని చెప్పారు. అనంతరం వాక్యపరిచర్య, క్రిస్మస్ గీతాలాపన, ప్రత్యేక పార్దనలు ఉంటాయన్నారు.

ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం ఆధ్వర్యంలో…

ఖమ్మం గాంధీచౌక్ 37వ డివిజన్ చాకలిబజార్ లోని కరిష్మ ఐపిసి ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్బంగా ఉదయం 6 గంటలకు పండుగ ఆరాధన నిర్వహిస్తున్నట్లు పాస్టర్ పి ఐజక్ తెలిపారు. ఈ సందర్బంగా క్రిస్మస్ కేక్‌కట్ చేయడం, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు , వాక్య సందేశం, ప్రత్యేక ప్రార్దనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News